ఢిల్లీలో ఘోరం.. బూట్ల దుకాణంలో అగ్నిప్రమాదం.. నలుగురి సజీవదహనం

ఠాగూర్
ఆదివారం, 30 నవంబరు 2025 (08:41 IST)
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ఓ బూట్ల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవదహనమయ్యారు. వీరిలో అన్నా చెల్లెలు కూడా ఉన్నారు. మరో మహిళ గాయపడింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. శనివారం సాయంత్రం నాలగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న బూట్ల దుకారణంలో శనివారం 6.24 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. బూట్ల దుకాణంలో మొదలైన మంటలు వేగంగా పై అంతస్తుకు కూడా వ్యాపించాయి. 
 
ఈ మంటల్లో చిక్కుకుని ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించింది. మృతులను భవన యజమాని సతేందర్ అలియాస్ జమ్మీ (38), అతని సోదరి అనిత (40)గా గుర్తించారు. మరో ఇద్దరు వివరాలు తెలియరాలేదు. మమత (40) అనే అనే మహిళ 25 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments