Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోయిడాలో వీధికుక్కను కాలితో తొక్కి చంపిన ట్రాఫిక్ పోలీస్.. ఫోటో వైరల్

నోయిడాలో ఓ ట్రాఫిక్ పోలీస్ ఓవరాక్షన్ చేశాడు. వీధికుక్కను కాలితో తొక్కి చంపి.. అదేమని ప్రశ్నిస్తే అది పిచ్చికుక్క అని చెప్పేశాడు. నోయిడాలోని సెక్టార్ 45 ప‌రిధిలో ర‌ద్దీ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ధర

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (19:32 IST)
నోయిడాలో ఓ ట్రాఫిక్ పోలీస్ ఓవరాక్షన్ చేశాడు. వీధికుక్కను కాలితో తొక్కి చంపి.. అదేమని ప్రశ్నిస్తే అది పిచ్చికుక్క అని చెప్పేశాడు. నోయిడాలోని సెక్టార్ 45 ప‌రిధిలో ర‌ద్దీ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ధరంసింగ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్.. అందరూ చూస్తుండగానే దాని గొంతుపై తన కాళ్లను ఉంచి నిల్చున్నాడు. అది చనిపోయేంతవరకు వదల్లేదు. ఈ సందర్భాన్ని స్థానికులు ఫోటో తీశారు. దీన్ని జంతు సంర‌క్ష‌క స్వ‌చ్ఛంద సంస్థ‌కు అంద‌జేశారు. 
 
ఈ ఫొటో కాస్త ఇప్పుడు వైర‌ల్ అయ్యింది. ఈ ఫొటోను ఆధారంగా చేసుకుని ఆ జంతు సంర‌క్ష‌ఖ సంస్థ నోయిడాలోని సెక్టార్ 39 పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. కానీ స్థానికులు మాత్రం కానిస్టేబుల్ చంపిన పిచ్చికుక్క ఇప్పటికే ఐదు మందిని కరిచిందని.. అందుకే చంపేశారని అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments