Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు లారీల బంద్

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (21:06 IST)
కేంద్రం తీసుకొచ్చిన నూతన మోటారు వాహన చట్టం ద్వారా ఊహించని రీతిలో విధిస్తున్న జరిమానాలకు వ్యతిరేకంగా ఏఎంటీసీ రేపు బంద్కు పిలుపునిచ్చింది. రేపు ఒక్కరోజు దేశవ్యాప్తంగా లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి.

ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ (ఏఎంటీసీ) ఆదేశాల మేరకు రేపు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఒక్కరోజు బంద్కు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటారు వాహన చట్టానికి వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్నట్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.

కొత్త చట్టం ద్వారా ఊహించని రీతిలో జరిమానాలు విధించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఈ బంద్కు సంపూర్ణ మద్దతునిస్తుందని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్రెడ్డి, దుర్గా ప్రసాద్ తెలిపారు.

దేశవ్యాప్తంగా బంద్... నూతన మోటారు వాహన చట్టం ద్వారా కార్మికులు, లారీ యజమానులు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో రేపు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎలాంటి రవాణా చేయొద్దని ఏఎంటీసీ నిర్ణయించిందని పేర్కొన్నారు.

వారి నిర్ణయం మేరకు రాష్ట్రంలో కూడా బంద్ తలపెట్టామని తెలిపారు. అత్యవసర సరుకుల రవాణాకు కూడా రేపు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రజలు ఒక్కరోజు బంద్కు సహకరించాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments