Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 టన్నుల టమాటాలతో వెళ్లిన లారీ మాయం.. గుండెలు బాదుకున్న..?

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (18:13 IST)
కొండెక్కిన టమాటా ధరలతో వాటిని పండించిన రైతులు.. కోటీశ్వరులు అవుతున్న ఘటనలు అనేకం. అయితే టమాటాల ధర భారీగా పెరిగిపోవడంతో దొంగతనాలు ఎక్కువైపోయాయి. తాజాగా టమాటా లోడుతో వెళ్తున్న లారీ మాయం కావడంతో ఓ వ్యాపారి గుండెలు బాదుకుంటున్నాడు. రూ. 21 లక్షల విలువైన 11 టన్నుల టమాటాలతో వెళ్తున్న లారీ కనిపించకుండా పోవడంతో ఆ వ్యాపారికి ఏం చేయాలో తోచక చివరికి పోలీసులను ఆశ్రయించాడు. 
 
కర్ణాటకలోని కోలార్‌ జిల్లా నుంచి మునిరెడ్డి అనే ఓ వ్యాపారికి చెందిన టమాటాల లోడుతో వెళ్లిన లారీ మాయం అయ్యింది.  ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీని మునిరెడ్డి అద్దెకు తీసుకున్నాడు. ఇందులో టమోటాలను పంపాడు. జీపీఎస్ ట్రాక్ కూడా అందుకు అమర్చాడు.
 
అయితే భోపాల్ టోల్ గేట్ వద్ద లారీ మాయమైంది. ఆపై లారీ డ్రైవర్ ఫోన్ కూడా స్వీచ్ఛాప్ కావడం ఆ రైతు గుండెలు బాదుకుంటున్నాడు. 15 కిలోల బరువున్న ఒక్కో బాక్సును రూ.2000 నుంచి రూ. 2150 ధర పెట్టి కొనుగోలు చేసినట్లు మునిరెడ్డి వివరించాడు. మొత్తం 11 టన్నులకు రూ. 21 లక్షలు చెల్లించానని వాపోయాడు. మునిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments