Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్ధవ్ థాక్రేను చెంపదెబ్బ కొట్టిన వారికి రెండు లక్షల రూపాయలిస్తా: తవ్ బీక్

Webdunia
శనివారం, 28 నవంబరు 2015 (09:45 IST)
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‍‌ను చెంపదెబ్బ కొడితే లక్ష రూపాయల నజరానా ప్రకటించిన శివసేనపై తవ్ హీద్ జమాత్ సంస్థ మండిపడింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఎవరైనా చెంపదెబ్బ కొడితే రెండు లక్షల రూపాయలు ఇస్తామని తమిళనాడు తవ్ హీద్ జమాత్ సంస్థ ప్రకటించింది.

అమీర్ ఖాన్ మత అసహనంపై చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. తమిళనాడు తవ్ హీద్ జమాత్ సహాయ ప్రధాన కార్యదర్శి తవ్ బీక్ మాట్లాడుతూ, ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టిన వారికి రెండు లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించారు. 
 
శివసేన చేస్తున్న ప్రకటనలకు తాము బెదిరిపోమని, ధైర్యంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా పంజాబ్‌కు చెందిన శివసేన విభాగం లూధియానాలో అమీర్ ఖాన్ బస చేసిన రాడిసన్ బ్లూ హోటల్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించి, అమీర్ ఖాన్‌ను చెంప దెబ్బ కొట్టిన వారికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments