Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్ అసెంబ్లీ గెలుపు కోసం టీఎంసీ రూ.150 కోట్లు ఖర్చు!

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (17:13 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజయభేరీ మోగించారు. అయితే, ఈ యేడాది ఆరంభంలో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ పార్టీ ఏకంగా రూ.150 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టు ప్రచారం సాగుతోంది. 
 
మరో వైపు తమిళనాడులో అన్నాడీఎంకేను ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న డీఎంకే పార్టీ.. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికలతో కలిసి రూ.114.14కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ఈ మేరకు ఆయా పార్టీల ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాలను పోల్ ప్యానెల్ పబ్లిక్ డొమైన్‌లో ఉంచింది.
 
గత అసెంబ్లీ ఎన్నికలకు తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ పుదుచ్చేరితో కలిపి ప్రచారం కోసం రూ.57.33 కోట్లు ఖర్చు వ్యయం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ల్లో ఎన్నికల్లో రూ.84.93 కోట్లు వెచ్చించింది. 
 
నాలుగు రాష్ట్రాలు, యూటీలో సీపీఐ కనీసం రూ.13.19కోట్లు ఖర్చు చేసింది. తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, కాంగ్రెస్ గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు కాగా.. డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రాంతీయ పార్టీలు. అయితే, బీజేపీకి సంబంధించిన ఖర్చుల వివరాలు అందుబాటులో లేవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments