Webdunia - Bharat's app for daily news and videos

Install App

థమ్స్ అప్, కోకాకోలా - రూ.5 లక్షల ఫైన్! ... ఎవరు? ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (19:46 IST)
థమ్స్ అప్‌, కోకాకోలాను నిషేధించాలని సుప్రీంకోర్టులో కేసు వేసిన పిటిషనర్‌కు ధర్మాసనం రూ.ఐదు లక్షల రూపాయల ఫైన్‌ విధించింది.

పిటిషనర్‌ తన వాదనల్లో సరైన కారణాలు చూపలేదని, సాంకేతిక సాక్ష్యాలు సరిగ్గా లేకుండానే కేసు వేశారని సుప్రీంకోర్ట్‌ పేర్కొంది. పిటిషనర్‌ ఉమేద్‌ సింగ్‌ చావ్‌డా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్ట్‌ ఈ రెండు బ్రాండ్లునే ప్రత్యేకంగా ఎందుకు నిషేధించాలో వివరించడంలో పూర్తిగా విఫలమయ్యాడని పేర్కొంది.

ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నందున థమ్స్ అప్‌, కోకా కోలాపై నిషేధం విధించాలని చావ్‌డా ప్రజాప్రయోజనవాజ్యాన్ని దాఖలు చేశారు.

చావ్‌డాకు సుప్రీంకోర్ట్‌ ఫైన్‌ విధిస్తూ పిటిషనర్‌ న్యాయవ్యవస్థను అవమానపరిచాడని, ఆ రెండు బ్రాండ్‌లు ఆరోగ్యానికి హానికరమని ఎటువంటి సాక్ష్యాలు చూపలేదని పేర్కొంది. నెలరోజుల్లోగా చావ్‌డా ఐదు లక్షల రూపాయల సుప్రీంకోర్ట్‌ రిజిస్ట్రీ వద్ద జమ చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments