Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలతో రాసలీలలు... ఉద్యోగాలు ఊడగొట్టుకున్న జడ్జీలు!

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (11:43 IST)
వ్యభిచార కేసుల్లో పట్టుబడే వారికి శిక్షలు విధించే న్యాయమూర్తులే వ్యభిచారం చేశారు. పైగా, పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ విషయం హైకోర్టుకు చేరడంతో విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో చేసిన తప్పును అంగీకరించిన న్యాయమూర్తులకు బీహార్ ప్రభుత్వం శిక్ష విధించింది. అంటే.. వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇది బిహార్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొన్నేళ్ళ క్రితం బీహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు జడ్జీలు నేపాల్‌కు వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో బసచేసిన వారు.. తమ గదులకు అమ్మాయిలను పిలిపించుకుని రాసలీలల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో పోలీసులు హోటల్‌లో రైడ్ చేయడంతో వారు స్వయంగా పట్టుబడ్డారు.
 
ఇలా పట్టుబడిన జడ్జీల్లో బీహార్‌లోని సమస్తిపూర్‌లో గతంలో ప్రిన్సిపల్‌ జడ్జిగా పనిచేసిన హరి నివాస్‌ గుప్తా, మరో ఇద్దరు జడ్జీలు జితేంద్రనాథ్‌ సింగ్‌, కోమల్‌ రాంలు ఉన్నారు. ఈ వ్యవహారంపై పాట్నా హైకోర్టు విచారణకు ఆదేశించింది. విచారణ జరిపిన అధికారులు ముగ్గురు జడ్జీలు తప్పు చేసినట్లు ధ్రువీకరించారు.
 
దీంతో హైకోర్టు ఈ ముగ్గురిని ఉద్యోగాల్లో నుంచి తొలిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ముగ్గురు జడ్జీలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ముగ్గురు జడ్జిలను ఉద్యోగాల నుంచి తొలిగిస్తున్నట్లు బీహార్‌ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments