Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ ఎమ్మెల్యేలు మామూలోళ్లు కాదు.. అసెంబ్లీలోనే కానిచ్చేశారు...

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లోనే పలువురు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈ కేసులు నమోదు చేశారు.

Webdunia
శనివారం, 8 జులై 2017 (13:31 IST)
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లోనే పలువురు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈ కేసులు నమోదు చేశారు. 
 
గత నెల 28న అసెంబ్లీకి హాజరయ్యేందుకు వెళ్లిన 35 ఏళ్ల పార్టీ మహిళా కార్యకర్తపై ఆప్ ఎమ్మెల్యేలు జర్నల్ సింగ్, అమానుతుల్లా ఖాన్, సోమ్‌నాథ్ భారతీలు కలిసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఓ గదిలో ఆమెను బంధించి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధిత మహిళ ఆ తర్వాతి రోజు పోలీసులకు వారిపై ఫిర్యాదు చేసింది. తనను తీవ్రంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొంది. 
 
అమానుతుల్లా ఖాన్ తనను నేలపై పడదోసి పట్టుకుంటే జర్నల్ సింగ్ తన పొట్టపై పిడిగుద్దులు కురిపించాడని ఆరోపించింది. దాదాపు అరగంట పాటు వారి వికృత చర్య కొనసాగిందని తెలిపింది. దీంతో ఆ ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైంగిక వేధింపులు, భౌతిక దాడి, అక్రమ నిర్బంధం తదితర ఆరోపణలపై వారిపై కేసులు నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం