Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతకంటే ఎక్కువ డబ్బిస్తే వదిలేస్తాం.. ఆర్బీఐ గవర్నర్ కు ఐసిస్ బెదిరింపు

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (06:45 IST)
‘మిమ్మలను లేకుండా చేసేందుకు కొంతమంది వ్యక్తులకు డబ్బులు ముట్టజెప్పాం. నేను చెల్లించిన దానికంటే మీరు ఎక్కువ చెల్లిస్తే వదిలేస్తాం లేదంటే మిమ్మల్ని చంపేయడం ఖాయం’ అంటూ ఐఎస్ ఐఎస్ పేరిట ఓ మెయిల్ ఆర్బీఐ గవర్నర్కు చేరింది. దీనిని పోలీసులు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. అంత తేలిగ్గా తాము భావించడం లేదని ముంబయి పోలీసులు ఇప్పటికే వ్యాఖ్యానించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్కు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ ఈమెయిల్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు బెదిరింపు హెచ్చరికలు చేశారు. ఈ మేరకు రఘురాం రాజన్‌కు ఓ ఈమెయిల్‌ ఐడీ isis583847@gmail.com నుంచి వచ్చింది. ఈ ఐడీ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) పేరుపై ఉంది. ఈ విషయం ముంబై పోలీసులకు చేరడంతో వారు సీరియస్‌గా దృష్టిసారించారు. 
 
డీఎన్ఏ వార్తా పత్రిక కథనం మేరకు... మిమ్మలను లేకుండా చేసేందుకు కొంతమంది వ్యక్తులకు డబ్బులు ముట్టజెప్పాం. నేను చెల్లించిన దానికంటే మీరు ఎక్కువ చెల్లిస్తే.. ఆ తర్వాత దీనిపై ఓ నిర్ణయించుకుందాం అంటూ ఆ మెయిల్‌ సారాంశంగా ఉంది. ఈ విషయాన్ని ముంబై సిటీ పోలీసు కమిషనర్ రాకేష్ మారియా నిర్ధారించారు. ఆర్బీఐ గవర్నర్‌కు బెదిరింపు మెయిల్ వచ్చినట్టు ఒక ఫిర్యాదును స్వీకరించినట్టు చెప్పారు. 
 
ఈ మెయిల్‌లో ఐఎస్ఐఎస్ అని ఉందన్నారు. ఈ బెదిరింపు మెయిల్‌ను ఆషామాషీగా తీసుకోవడం లేదని, ఈమెయిల్ పంపించిన వారిని గుర్తించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అంతేకాకుండా, ఈ మెయిల్ అడ్రస్, ఐపీని చేధించేందుకు యుఎస్ కేంద్రంగా పని చేసే గూగుల్ కార్యాలయాన్ని ముంబై పోలీసులు సంప్రదించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments