Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాసిక్‌కు దండుగా కదిలిన రైతులు ... నేడు భారీ బహిరంగ సభ

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (13:39 IST)
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉధృతంగా ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతుగా అనేక రాజకీయ పార్టీలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన మహారాష్ట్రలోని 21 జిల్లాల రైతులు మొన్న (శనివారం) నాసిక్‌లో కలుసుకున్నారు.
 
కాగా, ఈ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్న విషయం తెల్సిందే. 
 
‘ఆల్ ఇండియా  కిసాన్’ సభ పేరుతో ఒక్కటైన రైతులు వేలాదిమంది జెండాలు, బ్యానర్లతో నాసిక్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఆదివారం సాయంత్రం ముంబై చేరుకున్నారు. సోమవారం ఆజాద్ మైదానంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ హాజరవుతారు. 
 
మరోవైపు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలో రైతులు నిర్వహించనున్న ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి లభించింది. ఇందుకోసం వందలాదిమంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దుకు చేరుకుంటున్నారు. గణతంత్ర వేడుకల తర్వాత రైతుల ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభం అవుతుంది. 
 
ప్రతి ట్రాక్టర్‌పై జాతీయ జెండా ఉంటుంది. రైతులు ఆందోళన చేస్తున్న సింఘు, టిక్రి, ఘాజీపూర్, పల్వాల్, షాజహాన్‌పూర్ సరిహద్దుల నుంచి ట్రాక్టర్ ర్యాలీ మొదలవుతుంది. అవుటర్ రింగు రోడ్డులో 100 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం సాయంత్రం ర్యాలీ ముగుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments