Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. బెంగుళూరు మాల్‌లో గంటకు పార్కింగ్ చార్జి రూ.వెయ్యినా?

ఠాగూర్
బుధవారం, 6 మార్చి 2024 (14:52 IST)
దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే బెంగుళూరులో అన్ని రకాల వస్తువుల ధరలు ఎక్కువగానే ఉంటుంది. బెంగుళూరు నగరంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. ఇపుడు దీన్ని నిరూపించే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బెంగుళూరు నగరంలోని ఓ మాల్‌లో వాహనాల పార్కింగ్‌కు ఏకంగా వెయ్యి రూపాయలను వసూలు చేస్తున్నారు. అదీ కూడా ప్రీమియం పార్కింగ్ గంటకు మాత్రమే. దీనికి సంబంధించిన సైన్ బోర్డు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూబీ సిటీలో వాహనాల పార్కింగ్ ఫీజు తాలూకూ ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అందులో పార్కింగ్ ఫీజు గంటకు రూ.వెయ్యి అని ఉండటం చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
 
ఇషాన్ వైష్ అన్ ట్విట్టర్ యూజర్ ఈ ఫోటోను షేర్ చేశాడు. దాంతో ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. యూబీ సిటీ పార్కింగ్‌లో ఏదైనా ప్రత్యేకత ఉందా? దీనికోసం వారు గంటకు ఏకంగా రూ.1000 వసూలు చేస్తున్నారు" అని కామెంట్ చేశారు. కాగా, రాజధాని నగరంలో 2015 వరకు పార్కింగ్ ఫీజు గంటకు కేవలం రూ.40 మాత్రమే ఉండేది. కానీ వాహనాల సంఖ్య ప్రతి యేటా భారీగా పెరిగిపోవడంతో పార్కింగ్ సమస్య తలెత్తింది. దీంతో ప్రస్తుతం వాహనాల పార్కింగ్ స్థలం కూడా ఓ బడా వ్యాపారంగా మారిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments