Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓరేయ్.. డ్రోన్ వచ్చేస్తుందిరో.. పరుగో పరుగు.. తిరుప్పూర్ వీడియో వైరల్ (video)

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (18:50 IST)
Drone Camera
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో.. జనాలంతా ఇంటికే పరిమితం అయ్యారు. కానీ యువత మాత్రం కరోనాను లెక్క చేయకుండా అక్కడక్కడ గుంపుగా వుండటం.. క్యారంబోర్డు ఆడటం వంటివి చేస్తున్నారు. దొంగచాటుగా ఆడుకుంటూ లాక్ డౌన్‌ను లెక్క చేయట్లేదు. ఇలా లాక్ డౌన్‌ను లెక్క చేయకుండా వారిని కనుగొనేందుకు ప్రస్తుతం డ్రోన్ల సాయం తీసుకుంటున్నారు. 
 
ఈ డ్రోన్‌లు ఆకాశంలో ఎగురుతూ లాక్ డౌన్‌ను ఉల్లంఘించే వారిని కనిపెట్టేస్తోంది. ఇలాంటి ఘటనే ప్రస్తుతం తిరుప్పురూలో చోటుచేసుకుంది. క్యారంబోర్డు ఆడుతూ గుంపుగా వుండిన కొందరు యువకులు డ్రోన్ వస్తుందని గమనించి పరుగో పరుగు అంటూ పారిపోయారు. వెళ్తూ వెళ్తూ బైకును, క్యారంబోర్డు నెత్తినెట్టుకుని పరుగులు తీసిన వీడియోను తిరుప్పూరు పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచింది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో లాక్ డౌన్ అమలులో వున్న సంగతి తెలిసిందే. ఇలా లాక్ డౌన్‌లో ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యారా అని తెలుసుకునేందుకు తిరుప్పూరు పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇలా డ్రోన్ తిరుగుతుండగా.. ఓ చెట్టుకింద గుంపుగా క్యారంబోర్డు ఆడిన యువకులు డ్రోన్ కంట పడ్డారు. 
 
ఇంకా డ్రోన్ వచ్చిన విషయాన్ని గమనించిన యువకులు పరుగులు పెట్టారు. పరిగెడుతూ బైకును, క్యారంబోర్డును మరిచారు. మళ్లీ తిరిగొచ్చి వాటిని తీసుకుని పారిపోయారు. ఇలా క్యారంబోర్డుతో పరుగులు తీసిన యువకుడు డ్రోన్ నుంచి తప్పించుకునేందుకు ఆ బోర్డును నెత్తిన పెట్టుకుని తలదాచుకున్నాడు. ఈ వీడియోపై ప్రస్తుతం మీమ్స్ పేలుతున్నాయి. ఇంకేముంది.. ఈ వీడియోను మీరూ చూసి నవ్వుకోండి.. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments