జైపూర్‌లో దారుణం.. ఈ వీడియో చూస్తే భయంతో నిర్ఘాంతపోతారు... ధైర్యం ఉన్నవారే చూడండి!
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో దారుణం జరిగింది. ఒక మనిషిని.. మరో మనిషి ఇంత దారుణంగా హత్య చేస్తారా? నిజంగా ఈ వీడియో చూసిన నెటిజన్లు నిర్ఘాంతపోతున్నారు. నిజంగానే చిన్న పిల్లలు ఈ వీడియోను తిలకించకుండా
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో దారుణం జరిగింది. ఒక మనిషిని.. మరో మనిషి ఇంత దారుణంగా హత్య చేస్తారా? నిజంగా ఈ వీడియో చూసిన నెటిజన్లు నిర్ఘాంతపోతున్నారు. నిజంగానే చిన్న పిల్లలు ఈ వీడియోను తిలకించకుండా ఉండటమే మేలని పలు వెబ్‌సైట్లు హెడ్డింగ్‌లు పెట్టి వీడియోను అప్ చేశాయి కూడా. ఈనెల 9వ తేదీన జరిగిన ఈ దారుణ హత్య వివరాలను పరిశీలిస్తే..
జైపూర్‌లోని ఏటీఎం సెంటర్‌లో దోపిడీకి వచ్చిన కొందరు ముసుగు దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఏటీఎం కేంద్రంలో సెక్యూరిటీగా పని చేస్తున్న గార్డు.. ఏసీలో హాయిగా నిద్రపోతున్నాడు. ఇదే అదునుగా భావించిన ముసుగు దొంగలు సెక్యూరిటీగార్డును నిద్రలోనే చంపేశారు.
ఓ పెద్ద కట్టెతో తలపై కొట్టాడు. ఆ వెంటనే లేచేందుకు ప్రయత్నించగా, ఆ తర్వా పదేపదే తలపైనే కొట్టడంతో అతను అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ సీన్ అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. పుటేజిల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్‌లా వ్యాపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భయంతో నిర్ఘాంతపోతున్నారు.