Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిని దోచుకున్నారు... వెళ్తూవెళ్తూ యువతిని రేప్ చేసి నుదుటిపై బొట్టుపెట్టిన గజదొంగ!

అరాచకాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్‌లో దొంగతనాలు, రేప్‌లతో పాటు పలు వింత చర్యలు కూడా జరుగుతున్నాయి. ఇంట్లో దొంగతనానికని వచ్చిన ఇద్దరు దొంగల్లో ఒక గజదొంగ ఇంట్లో ఉన్నదంతా దోచుకొని వెళ్తూ వెళ్తూ... ఆ ఇం

Webdunia
శనివారం, 25 జూన్ 2016 (15:17 IST)
అరాచకాలకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్‌లో దొంగతనాలు, రేప్‌లతో పాటు పలు వింత చర్యలు కూడా జరుగుతున్నాయి. ఇంట్లో దొంగతనానికని వచ్చిన ఇద్దరు దొంగల్లో ఒక గజదొంగ ఇంట్లో ఉన్నదంతా దోచుకొని వెళ్తూ వెళ్తూ... ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిని అత్యాచారం చేసి ఆపై ఆమెకు కుంకుమ బొట్టు పెట్టి పారిపోయాడు. 
 
ఈ వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫరుఖాబాద్ జిల్లాలో ఒక ఇంట్లోకి ఇద్దరు గజ దొంగలు దొంగతనానికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ఒక యువతి మాత్రమే ఒంటరిగా ఉంది. ఆమె తల్లిదండ్రులు పనిమీద బంధువుల ఇంటికి వెళ్ళారు. ఇదే అదనుగా భావించిన ఆ ఇద్దరు దొంగలు యువతిని డబ్బు కోసం కత్తితో బెదిరించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకోవాలని ప్రయత్నించగా అందులో ఒకడు ఆమెను బలవంతంగా లాక్కెల్లి దారుణంగా అత్యాచారం చేశాడు. 
 
ఆ తర్వాత కూడా డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నాయని ఆమెను బెదిరించాడు. భయంతో వణికిపోయిన ఆ యువతి ఇంట్లో ఉన్న రూ.35 వేల నగదును, కొన్ని విలువైన నగలను దొంగకు ఇచ్చింది. అన్నీ మూటగట్టుకున్న ఆ గజదొంగ వెళ్తూ వెళ్తూ యువతి నుదుటిపై కుంకుమ బొట్టుపెట్టాడు. తర్వాత ఇద్దరు దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు ఆ యువతి జరిగిన విషయాన్ని వివరించింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments