ప్రియురాలికి రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించిన చోర శిఖామణి!

ఠాగూర్
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (14:47 IST)
చోరీలు చేసిన సొమ్ముతో తన ప్రియురాలికి అత్యంత ఖరీదైన ఇంటిని నిర్మించాడో దొంగ. ఆ ఇంటిలో పెట్టేందుకు రూ.22 లక్షల వ్యయం చేసే ఆక్వేరియంను బహుమతిగా ఇచ్చాడు. మొత్తంగా ఆ ఇంటి నిర్మాణం కోసం ఆ చోర శిఖామణి ఏకంగా రూ.3 కోట్ల మేరకు ఖర్చు చేసి ప్రతి ఒక్కరి మతిపోయేలా చేశాడు. 
 
తాజాగా బెంగుళూరు పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన పంచాక్షరి స్వామి (37) అనే వ్యక్తి బాల్యం నుంచి చోరీలు చేసే అలవాటు ఉంది. దీంతో చోరీల్లో ఆరితేరిన దొంగగా తయారయ్యాడు. 2009 నాటికి ఘరానా దొంగగా మారి కోట్ల రూపాయలు సంపాదించాడు. 
 
2014-15 సమయంలో ప్రముఖ సినీనటితో స్వామికి పరిచయం ఏర్పడింది. ఆమె కోసం కోట్లు ఖర్చు చేశాడు. అంతేకాదు, కోల్‌కతాలో మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించి ఇచ్చాడు. అందులో పెట్టేందుకు రూ.22 లక్షల విలువైన ఆక్వేరియంను గిఫ్ట్ ఇచ్చాడు.
 
ఈ క్రమంలో 2016లో ఓ చోరీ కేసులో గుజరాత్ పోలీసులు స్వామిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఆరేళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. గతేడాది బెంగళూరుకు మకాం మార్చి తిరిగి దొంగతనాలు మొదలుపెట్టాడు. జనవరి 9న మడివాలా ప్రాంతంలో చోరీ చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెప్పింది విని పోలీసులు నోరెళ్లబెట్టారు.
 
బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించే నిందితుడు స్వామి వాటిని కరిగించి బిస్కెట్లుగా మార్చేవాడు. అతడి నుంచి ఇప్పటివరకు 181 గ్రాముల బంగారం 333 గ్రాముల వెండి, పలు రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
కాగా, స్నేహితురాలికి రూ.3 కోట్లతో ఇల్లు కట్టించి ఇచ్చిన నిందితుడు తాను మాత్రం తల్లి ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఇంటికి కూడా వాయిదాలు సరిగా చెల్లించకపోవడంతో బ్యాంకు వేలం నోటీసులు ఇచ్చింది. నిందితుడు పంచాక్షరి స్వామికి వివాహమై ఒక చిన్నారి కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments