Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంకా గాంధీ చర్యకు మోడీ ఫ్యాన్స్ ఫిదా(Video)

Webdunia
మంగళవారం, 14 మే 2019 (15:37 IST)
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలోభాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా చివరి దశ ఎన్నికల ప్రచారం కోసం ఆమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇందులోభాగంగా, ఆమె సోమవారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. 
 
ఈ సందర్భంగా ఆమె నడుచుకున్న తీరు, ప్రదర్శించిన హూందాతనంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆమె కాన్వాయ్ వెళుతున్న సమయంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు. 
 
దీంతో తన కారును ఆపి.. భద్రతా సిబ్బందితో కలిసి ఆమె బీజేపీ కార్యకర్తల వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. ఆమె సంయమనంతో చిరునవ్వులు చిందిస్తూ వారి వద్దకెళ్లి కరచాలనం చేశారు. "మీరు మీ పని చూసుకోండి.. నా పని నేను చేసుకుంటా.. ఆల్ ది బెస్ట్" అని ప్రియాంక అన్నారు.
 
సాధారణంగా రాజకీయ నేతలు తమ ప్రత్యర్థులకు మద్దతుగా నినాదాలిచ్చిన వారిపై రెచ్చిపోవడం చూస్తుంటాం. కానీ, ప్రియాంక అందుకు భిన్నంగా ఎంతో సంస్కారవంతంగా ప్రవర్తించడం స్థానికుల్ని ఆకట్టుకుంది. 
 
కాగా, ఆమె సోమవారం ఇండోర్‌లో రోడ్ షో నిర్వించారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ రోడ్‌షోను తిలకించేందుకు స్థానికులు భారీ సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఆమెకు స్వాగతం పలికారు. రోడ్‌షోలో అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న ప్రియాంక.. మధ్యలో కొంత మంది మోడీ అనుకూల నినాదాలు చేయడంతో ఆమె హుందాతనంగా నడుచుకోవడంతో మోడీ ఫ్యాన్స్‌తో పాటు దేశ ప్రజలు కూడా ఫిదా అయిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments