Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య వదిలేసిందని 20 మంది అమ్మాయిలను లైన్లో పెట్టాడు, చివరికి?

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (17:50 IST)
చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తాడు. స్మార్ట్ బాయ్. అందంగా ఉండటంతో అమ్మాయిలు కూడా అతనంటే ఇష్టపడుతుంటారు. అదే అతను చేసుకున్న అదృష్టం.. యువతులు చేసుకున్న దురదృష్టం. ప్రేమ, పెళ్ళి పేరుతో 20 మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న మన్మథన్.. చివరకు అడ్డంగా దొరికిపోయాడు.
 
చెన్నైలోని ఆవడి సమీపంలో తిరుములైవాయల్ ప్రాంతంలో నివాసముండే రాకేష్‌శర్మ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చదువులో ఎప్పుడూ ముందుండే రాకేష్‌కు మంచి ఉద్యోగమే వచ్చింది. జీతం లక్షరూపాయలు. ఆ జీతం చూపించే మొదట్లో పెళ్ళి చేసుకున్నాడు. కానీ జీతం సరిపోకపోవడం.. భార్య కోరికలు తీర్చడానికి ఇబ్బంది పడడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది.
 
అయినా రాకేష్ మాత్రం తనకు తానుగా ధైర్యం చెప్పుకున్నాడు. మళ్ళీ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని రాకేష్ శర్మ అమ్మాయిలతో ఆడుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్ళి చేసుకుని టైం వేస్ట్ చేసుకోవడం కన్నా వారిని వాడుకొని వదిలేయాలనుకున్నాడు. అది కూడా డబ్బులు బాగా ఉన్నవారినే టార్గెట్ చేయాలనుకున్నాడు.
 
ఇలా ఒకరిద్దరు కాదు.. ఏకంగా 20 మందితో బాగా ఎంజాయ్ చేశాడు. వారితో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను జాగ్రత్త చేసి ఆ తరువాత మెల్లగా డబ్బులు డిమాండ్  చేయడం మొదలెట్టేవాడు. పెళ్ళి చేసుకోను.. డబ్బులిస్తే చాలు మీ వీడియోలను డిలీట్ చేస్తానంటూ 20 మందిని మోసం చేసేశాడు.
 
అయితే కొడుంగైయూరు ప్రాంతానికి చెందిన ఒక యువతికి మాత్రం అడ్డంగా దొరికిపోయాడు రాకేష్‌ శర్మ. ఆమెతో ఏకాంతంగా కలిసి ఉన్న ఫోటోలను చూపించి తండ్రిని బెదిరించాలనుకున్నాడు. ఆమె తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాకేష్ శర్మ మన్మథన్ అని నిర్థారించుకుని అతన్ని కటాకటాల్లోకి నెట్టారు. అతని గదిలోని కంప్యూటర్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments