Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్‌ సిగ్నల్ కోసం 50 అడుగుల జెయింట్‌వీల్‌ ఎక్కిన మంత్రి

Webdunia
సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (14:18 IST)
మధ్యప్రదేశ్‌ అశోక్‌ నగర్‌ జిల్లాలో ఫోన్‌ సిగ్నల్‌ కోసం మంత్రి ఏకంగా 50 అడుగుల ఎత్తైన జెయింట్‌ వీల్‌ను ఎక్కారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. డిజిటల్‌ ఇండియా అంటూ ఊదరగొట్టే ప్రభుత్వంలో సిగ్నల్ ‌ కోసం మంత్రి ఈవిధంగా జెయింట్‌ వీల్‌ ఎక్కారంటూ పలు మీమ్స్‌ స్క్రోల్‌ అయ్యాయి.

పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ మంత్రి బ్రజేంద్ర సింగ్‌ యాదవ్‌ ఆదివారం అమ్ఖో గ్రామంలో ఏర్పాటు చేసిన 'భగవద్‌ కథా' అనే ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చుట్టూ కొండలతో ఉన్న ఈ ప్రాంతంలో ఫోన్‌ సిగ్నల్స్ ‌ సరిగా అందలేదు. దీంతో మంత్రి 50 అడుగుల ఎత్తైన జెయింట్‌ వీల్‌ ఎక్కి ఫోన్‌ మాట్లాడారు.

ఈ ఫొటో స్థానిక వార్తాపత్రికలో ప్రచురితం కావడంతో వైరల్‌గా మారింది. స్థానిక సమస్యలపై పలువురు మంత్రికి మెమోరాండం సమర్పించేందుకు వచ్చినప్పటికీ.. మంత్రి పట్టించుకోకుండా ఫోన్‌ సిగల్స్‌ కోసం తిరుగుతండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫొటోపై మంత్రి బ్రజేంద్ర సింగ్‌ స్పందించారు. తాను ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు యత్నించానని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments