Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటికి పెళ్లి ప్రపోజల్, కాదన్నందుకు కత్తితో పొడిచిన ప్రొడ్యూసర్

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (18:39 IST)
ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
ప్రేమోన్మాదులు ఈమధ్య కాలంలో ఎక్కువయిపోతున్నారు. తొలుత స్నేహం అంటూ పరిచయం పెంచుకుని ఆ తర్వాత మెల్లిగా సదరు యువతులను తమను పెళ్లాడాలంటూ బలవంతం చేస్తున్నారు. మాట వినకపోతే హత్య చేసేందుకు ఎంతమాత్రం వెనుకాడటంలేదు. తాజాగా ఓ సినీ నిర్మాత ఏకంగా ఓ నటిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే... బాలీవుడ్ నటి మాల్వీ గత ఏడాది ఓ ప్రొడక్షన్ పని నిమిత్తం నిర్మాత యోగేశ్ కుమార్‌ను కలిశారు. అలా వారి మధ్య పరిచయమయ్యింది. ఆ పరిచయాన్ని అడ్డంపెట్టుకుని ఇటీవలే ఆమె వద్ద పెళ్లి ప్రపోజల్ చేసాడు యోగేశ్. అతడి ప్రపోజల్‌కు నో చెప్పింది మాల్వీ. ఇక అప్పట్నుంచి అతడు ఆమెపై కసి పెంచుకున్నాడు.
 
బుధవారం రాత్రి మాల్వీ కారులో ఇంటికి వస్తుండగా యోగేశ్ ఆడి కారులో వచ్చి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె కడుపులో నాలుగుసార్లు పొడిచాడు. దాంతో ఆమె పెద్దపెట్టున కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు రావడంతో యోగేశ్ అక్కడ నుంచి పారిపోయాడు. కాగా గాయపడిని మాల్వీని ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు వైద్యులు తెలిపారు.
 
కాగా యోగేశ్ తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడనీ, తను ఓ నిర్మాతనంటూ పరిచయం చేసుకున్నట్లు మాల్వీ వెల్లడించింది. తన వద్ద పెళ్లి ప్రపోజల్ తీసుకురాగానే అతడిని దూరం పెట్టినట్లు ఆమె చెప్పారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments