Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం గదిలోకి పాల గ్లాసుతో వెళ్ళిన పెళ్ళి కూతురు, గట్టిగా కేకలు పెట్టిన పెళ్లికొడుకు?

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (09:53 IST)
పెళ్ళి అయిపోయింది. ఇక శోభనమే. ఇక యధాతథంగానే పాలు గ్లాసుతో పెళ్ళి కూతురు పెళ్ళికొడుకు గదిలోకి వెళ్ళింది. ఎంతో ఆశతో పాలు తాగిన పెళ్ళికొడుకు బెడ్ పైన పడుకున్నాడు. ఇక ఏముంది పెళ్ళి కూతురు మెల్లగా బెడ్ పైన కూర్చుంది. పక్కనే ఉన్న పండ్లు ఉన్న ప్లేటు తీసుకుని పెళ్ళికొడుకు నెత్తిపై ఒకటి బాదింది.. అంతే...
 
ఉత్తరప్రదేశ్ లోని బిజునూర్ జిల్లాకు చెందిన యువకుడుకి హరిద్వార్‌కు చెందిన యువతికి రెండురోజుల క్రితం వివాహమైంది. పెద్దలు కుదిర్చిన పెళ్ళే. వివాహం ఆర్భాటంగా జరిగింది. కట్నకానుకలన్నీ ఇచ్చిపుచ్చుకోవడం అయిపోయాయి. పెళ్ళి కూతురుతో ఇక శోభనమే.
 
శోభనానికి పెద్దలు అంతా సిద్థం చేశారు. ముహూర్తం ఖరారు. సమయం ఆసన్నమైంది. పెళ్ళి కూతురిని గదిలోకి పంపారు. పంపడమే ఇక ఆలస్యం పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చేతిలోని పాల గ్లాసును తీసుకొని తాగి రెచ్చిపోదామని డిసైడ్ అయ్యాడు. పెళ్ళి కూతురును మెల్లగా బెడ్ పైకి లాగాడు.
 
ఇక ఏముంది పెళ్ళి కూతురు అప్పటికే స్కెచ్‌తో వచ్చినట్లుంది. పండ్లు తినే విధంగా పక్కకు వెళ్ళింది. పండ్లతో బరువుగా ఉన్న ప్లేటును తీసుకొని పెళ్ళి కొడుకు తలపై ఒకే ఒక్క దెబ్బ కొట్టింది. అంతే పెళ్ళి కొడుకు అరుపులు కేకలు వేశాడు. శోభనంలో జరిగే అరుపులు అనుకుని పెద్దలు ఊరుకున్నారు.
 
తెల్లవారుజాము అయ్యింది. నూతన వధూవరులిద్దరు ఇంకా లేవలేదు. తలుపులు కొట్టి చూశారు. పెళ్ళి కొడుకు స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. తలకు పెద్ద గాయమైంది. ఆసుపత్రిలో చేర్పించారు. తేరుకున్న పెళ్ళి కొడుకు అసలు విషయం చెప్పాడు. ఇంటిలోని సి.సి.కెమెరాలను చూశారు. పెళ్ళి కూతురు ప్రియుడితో ఇంటి వెనుక నుంచి పారిపోతూ కనిపించింది. ఇంకేముంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments