Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీవ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన నటి

Webdunia
బుధవారం, 25 మే 2022 (22:52 IST)
జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో బుధవారం ఓ మహిళా టెలివిజన్ ఆర్టిస్ట్, ఆమె మైనర్ మేనల్లుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అమ్రీన్ భట్ అనే మహిళా నటి గాయాలతో మరణించగా, 10 ఏళ్ల మేనల్లుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


రాత్రి 8 గంటల సమయంలో, జిల్లాలోని చదూరా ప్రాంతంలోని హుష్రూలో ఆమె నివాసానికి సమీపంలో ఉన్న అమ్రీన్ అనే టీవీ ఆర్టిస్ట్ పైన ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఒక అధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

 
తీవ్రంగా గాయపడిన అమ్రీన్‌ను చదూర ఆసుపత్రికి తరలించారు. ఐతే ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిందని తెలిపారు. ఈ ఘటనలో ఆమె మేనల్లుడు ఫర్హాన్ జుబేర్ కూడా గాయపడ్డాడని అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ప్రమేయం ఉన్నదని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు.
 
ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. తీవ్రవాదుల కోసం గాలింపు ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. లోయలో పౌర హత్యల పరంపర సాగుతోంది. మే 12వ తేదీన బుద్గామ్ జిల్లా చదూరాలోని తహసీల్ కార్యాలయంలోని రాహుల్ భట్ అనే ఉద్యోగిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆయన మృతితో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments