తోటలోని మామిడి పండ్లు కోశారనీ.. బాలుడిని కాల్చి చంపాడు.. ఎక్కడ?

నేరాలకు ఘోరాలకు అడ్డాగా మారిన బిహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మామిడి పండ్లు కోశాడనీ పదేళ్ల బాలుడుని కాల్చి చంపాడో మానవమృగం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (11:09 IST)
నేరాలకు ఘోరాలకు అడ్డాగా మారిన బిహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మామిడి పండ్లు కోశాడనీ పదేళ్ల బాలుడుని కాల్చి చంపాడో మానవమృగం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
బీహార్‌లోని ఖగారియా జిల్లా పాత్రాహా గ్రామంలో పిల్లలంతా సమీపంలోని మామిడి తోటలో ఆడుకుంటారు. గురువారం తోటి పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన సత్యం కుమార్... తోటలో మామిడి పండ్లు కోసేందుకు ప్రయత్నించాడు. దీంతో తోట కాపలా కాస్తున్న రామాశీష్ యాదవ్ (43) అనే వ్యక్తి పిల్లాడిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆ పిల్లోడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీంతో మిగతా పిల్లలంతా ప్రాణభయంతో పరుగుల తీస్తూ గ్రామంలోకి వచ్చి తోటలో జరిగిన విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత గ్రామస్తులు మామిడి తోటలోకి వెళ్లేలోపే రామాశీష్ పారిపోయాడు. ఈ కిరాతక చర్యపై సత్యం కుమార్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments