Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణతంత్ర దినోత్సవ సంబరాలలో తెలంగాణ రైతులు.. వ్యవసాయంతో కోటి!

సెల్వి
గురువారం, 25 జనవరి 2024 (13:32 IST)
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ సంబరాలలో పాల్గొనడానికి తెలుగు రైతులకు ఆహ్వానం అందింది. రైతులతో పాటు వారి భార్యలకు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసి మరీ రిపబ్లిక్ డే సంబరాలలో పాల్గొనాలని కోరింది. 
 
తెలంగాణలో పండ్ల తోటలు, కూరగాయలు పండిస్తున్న ఐదుగురి రైతులకు 75వ రిపబ్లిక్ డే సంబరాలలో పాల్గొనే ఈ అరుదైన గౌరవం లభించింది. వీరితోపాటు వనపర్తి జిల్లాకు చెందిన హార్టికల్చర్ అధికారి శ్రీకాంత్‌ని కూడా ప్రభుత్వం ఢిల్లీకి ఆహ్వానించింది. 
 
సంగారెడ్డి జిల్లాకు చెందిన, మొహమ్మద్ హనీఫ్ అనే రైతు, గుమ్మడిదల మండలంలోని మంబాపూర్లో 20 ఎకరాలలో కూరగాయలు పండిస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ఒకే సంవత్సరం కోటి రూపాయలకు పైగా సంపాదించిన ఘనత ఈ ఖాతాలో వుంది. 
 
హనీఫ్‌తో పాటు, తన భార్య అలియా బేగం కూడా ఇప్పటికే గణతంత్ర సంబరాలలో పాల్గొనడానికి ఢిల్లీ బయలుదేరారు. జహీరాబాద్ మండలంలోని బుర్ధిపాడ్ గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో 28 రకాల మామిడి పండ్లు పండిస్తున్న బవగి శ్రీరామ్‌కు కూడా గణతంత్ర సంబరాలలో పాల్గొనడానికి అవకాశం లభించింది. 
 
తెలంగాణ మొత్తం మీద ఐదుగురు రైతులకు ఆహ్వానం వస్తే, అందులో ఇద్దరు రైతులు సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కావటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments