Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగుడు కోసం లాప్‌టాప్ అమ్మేయాలనుకున్నాడు.. భార్య అడ్డం పడింది.. పెద్దరాయితో కొట్టింది.. ఆపై?

ఒక లాప్‌టాప్ ఓ యువకుడి నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ విషాద ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని కనొటాలో చోటుచేసుకుంది. బాధితుడి భార్య ఎనిమిదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవడంతో స్కూల్ యాజమాన్యం ఆమెకు

Webdunia
శనివారం, 2 జులై 2016 (14:32 IST)
ఒక లాప్‌టాప్ ఓ యువకుడి నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ విషాద ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని కనొటాలో చోటుచేసుకుంది. బాధితుడి భార్య ఎనిమిదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవడంతో స్కూల్ యాజమాన్యం ఆమెకు ల్యాప్‌టాప్‌ని బహుకరించింది. అయితే ఆమె భర్త తాగుడుకు బానిసై ఆ లాప్‌టాప్‌ని అమ్మేందుకు ప్రయత్నించాడు. దీంతో భార్యకు కోపం కట్టలు తెంచుకుంది. 
 
క్షణికావేశంలో తాగినమైకంలో ఉన్న భర్తను ఓ పెద్దరాయి తీసుకొని కొట్టింది. దెబ్బ గట్టిగా తలకు తగలడంతో భర్త వెంటనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు. వివరాలను పరిశీలిస్తే... నిందితురాలికి 16 ఏళ్ల వయసున్నప్పుడే హర్ఫుల్ (20) అనే వ్యక్తితో పెళ్లయింది. హర్ఫుల్ ఓ ఆటోమొబైల్ షో రూమ్‌లో పనిచేస్తున్నాడు. హర్ఫుల్ తాగుబోతు కావడంతో అతనికి భార్యతో తరుచూ గొడవ జరిగేది. 
 
భార్యకు మూడేళ్ల కిందట ఎనిమిదో తరగతిలో టాప్ రావడంతో ల్యాప్ టాప్ బహుమతిగా లభించింది. అయితే భర్త తాగడానికి డబ్బుల కోసం దానిని అమ్మేందుకు ప్రయత్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెద్దగా మారింది. ''నువ్వు చదువు ఆపేశావుగా నీకెందుకు ల్యాప్ టాప్" అని ఆమెతో గొడవకి దిగాడు. దీంతో భార్యకి ఎక్కడలేని కోపం కలిగింది. చిన్నగా మొదలైన వీరి గొడవ పెనుతుఫానులా మారింది. 
 
భర్త తన మాట ఎంతకూ వినకపోవడంతో పెద్ద రాయిని తీసుకొని అతడినికొట్టింది. అది హర్ఫుల్ తలకు తగలడంతో అతను వెంటనే కుప్పకూలాడు. భార్య తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు హర్ఫుల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments