Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్నాలజీ సాయంతో భార్య అక్రమ సంబంధం గుట్టు రట్టు.. విడాకులు తీసుకున్న టెక్కీ!

Webdunia
మంగళవారం, 10 మే 2016 (13:46 IST)
వివాహేతర సంబంధం సాగిస్తున్న భార్య గుట్టుని టెక్నాలజీ సాయంతో ఓ భర్త బట్టబయలు చేశాడు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌ భార్య మ‌రొక‌రితో చాలా కాలంగా అక్ర‌మ సంబంధం కొనసాగిస్తోంది. భార్య ప్ర‌వ‌ర్త‌న‌‌పై అనుమానం వ‌చ్చిన ఆ టెక్కీ చాలా తెలివిగా ఆమె అక్ర‌మ సంబంధం గుట్టును ర‌ట్టు చేసి విడాకులు పొందాడు. పూర్తి వివరాలను పరిశీలిస్తే బెంగ‌ళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తున్న 31 ఏళ్ల యువకుడు భార్య, మూడేళ్ల కూతురితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివాసముంటున్నాడు. 
 
గత ఏడాది ఫిబ్రవరిలో అతనికి మెదటిసారి భార్యపై అనుమానం కలిగింది. త‌న ఇంట్లో సిగ‌రెట్ ముక్కలు ఉండ‌డం గ‌మ‌నించి విస్తుపోయాడు. ఇంట్లో సిగ‌రెట్ తాగేవాళ్లు ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన ఆ భర్త ఈ విష‌య‌మై భార్య‌ను నిలదీస్తే  త‌న‌కేం తెలియ‌ద‌ని బుకాయించింది. భార్య ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం ఎక్కువ‌వ్వ‌డంతో ఆమెపై కన్నేసి ఉంచాడు. ఇంట్లో ఆమెకు తెలియకుండా నాలుగైదుచోట్ల సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆధునాతన అప్లికేషన్లను వినియోగించి భార్య ఫోన్‌ను తన లాప్ టాప్‌కు అనుసంధానం చేశాడు. అయితే భ‌ర్త‌కు అనుమానం రావ‌డంతో భార్య కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్నట్లు నటించింది. 
 
వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. జూలైలో ఆమె తన బాయ్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని, వచ్చేటప్పుడు గర్భనిరోదక మాత్రలు తెమ్మని చెప్పిన మాటలు టెక్కీకి తెలిసిపోయింది. భర్త అమర్చిన సీసీటీవీ కెమేరాలు బాత్ రూమ్‌లో, లివింగ్ రూమ్‌లో, బెడ్ రూమ్‌లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఆమె సాగించిన రాసలీలలన్నీ రికార్డయ్యాయి. అంతే ఆ వీడియో ఫుటేజీలను చేతబట్టుకుని నేరుగా కోర్టుకు వెళ్లిన టెక్కీ తనకు విడాకులు కావాలని కోర్టుని కోరాడు. కోర్టు ఆ వీడియోలను వీక్షించి టెక్కీకి త‌న భార్య నుంచి విడాకులు మంజూరు చేసింది. పాప సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లు కూడా తండ్రికే అప్ప‌గించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments