Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో తిరుగుతుందని ప్రేయసిని చంపేశాడు... ఖాకీలకు చిక్కి జైల్లో ప్రియుడి ఆత్మహత్య

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో తిరుగుతుందని ప్రేయసిని చంపేశాడు.. చివరకు పోలీసులు అరెస్టు చేసి జైల్లో బంధిస్తే అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడో.. ప్రియుడు. చెన్నైలో జరిగిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... కోయంబత్తూరు అ

Webdunia
గురువారం, 11 మే 2017 (13:01 IST)
ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో తిరుగుతుందని ప్రేయసిని చంపేశాడు.. చివరకు పోలీసులు అరెస్టు చేసి జైల్లో బంధిస్తే అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడో.. ప్రియుడు. చెన్నైలో జరిగిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... కోయంబత్తూరు అన్నామలైనగర్‌కు చెందిన టీచర్‌ నివేద (47)ను ఇళయరాజా స్థానిక అన్నానగర్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి కారుతో ఢీకొని హతమార్చగా, పోలీసులు అతన్ని అరెస్టు చేసి పుళల్‌ జైలుకి తరలించారు. తనకు కేటాయించిన సెల్‌లోనే ఇళయరాజా బుధవారం ఉదయం కిటికీ చువ్వలకు లుంగీ కట్టి ఉరి వేసుకుని వ్రేలాడుతూ కనిపించాడు. 
 
అతని పేరు ఇళయరాజా. అగ్నిమాపకదళం విభాగంలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దీంతో వార్డర్లు వెంటనే అక్కడకు చేరుకుని అతన్ని కిందకి దించి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతని ప్రాణం పోయినట్టు గుర్తించారు. క్షణికావేశంలో ప్రియురాలిని హతమార్చిన ఇళయరాజా తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 
 
కాగా, ఇద్దరు పిల్లలు కలిగిన నివేద కోవై జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. చాలా అందంగా ఉండటంతో పలువురు పలువురు పురుషులతో సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేయాలన్న కోరిక కలిగింది. దీంతో భర్తకు దూరమైంది. ఈ క్రమంలో ఇళయరాజాతో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
 
ఇతనితో ఉంటూనే ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తూ వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేని ఇళయరాజా... ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ఉన్న సంబంధం తెంచుకోవాలని నివేదను హెచ్చరించాడు. అంతటితో ఆగని ఇళయరాజా.. చెన్నైకు తీసుకొచ్చి.. నివేదికకు, ఆమె ప్రియుడికి వార్నింగ్ ఇవ్వాలని భావించాడు. 
 
అయితే ప్రియుడితో కలిసి పారిపోయేందుకు నివేద ప్రయత్నించడంతో ఆగ్రహించిన ఇళయరాజా కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత తానుకూడా పుళల్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం వీరి మృతదేహాలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉండగా, ఈ శవాలను తీసుకెళ్లేందుకు వారివారి కుటుంబ సభ్యులు నిరాకరిస్తున్నారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments