Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసి మోసం చేసింది.. జీవితంపై విరక్తి.. టెక్కీ ఆత్మహత్య.. నిద్రొస్తుందని బెడ్‌రూమ్‌లోకి వెళ్లి?

గత వారం పూణేలోని ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న లేడీ టెక్కీ రసిలా రాజు (24) ఆమె పని చేస్తున్న కార్యాలయంలోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత డిసెంబర్ నెలలో పూణేలో తను పని చేస్తున్న కార్యాలయంలోనే మరో టెక్క

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (15:00 IST)
గత వారం పూణేలోని ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న లేడీ టెక్కీ రసిలా రాజు (24) ఆమె పని చేస్తున్న కార్యాలయంలోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత డిసెంబర్ నెలలో పూణేలో తను పని చేస్తున్న కార్యాలయంలోనే మరో టెక్కీ ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా జీవితంపై విరక్తిని పెంచుకున్న ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పూణే నగరంలో చోటుచేసుకుంది. 
 
ఇందుకు కారణం కూడా ప్రేమేనని తేలింది. ప్రేమలో విఫలం కావడమే టెక్కీ ఆత్మహత్యకు కారణమైందని పోలీసులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కు చెందిన అభిషేక్ కుమార్ (23) అనే యువకుడు.. పూణేలోని రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్కులోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 
 
ఇతను ప్రేమలో విఫలం కావడంతో నెల రోజుల పాటు స్నేహితులతో కలిసిమెలసి ఉండలేకపోయాడు. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించేవాడు ఈ క్రమంలో అభిషేక్.. తన స్నేహితులతో కలిసి వుంటున్న అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిద్రొస్తుందని వెళ్లి బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన అభిషేక్‌ చాలాసేపటికి తలుపులు తెరవకపోవడంతో కిటికీల నుంచి చూశామని.. అప్పటికే అభిషేక్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడని స్నేహితులు అన్నారు. 
 
కానీ అతనిని కాపాడేలోపే జరగాల్సిన అనర్థం జరిగిపోయిందని స్నేహితులు వాపోయారు. ఇంకా ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే అభిషేక్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో అభిషేక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు అతని స్నేహితులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments