Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో పెను విపత్తు : కొండ చరియలు విరిగిపడి...

Webdunia
ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (14:15 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పెను విపత్తు సంభవించింది. మంచు చరియలు విరిగిపడటంతో ఓ విద్యుత్ కేంద్రాన్ని వరద నీరు ముంచెత్తింది. ఈ ప్రమాదంలో 150 మంది కార్మికులు గల్లంతవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 
 
మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది ఒక్కసారిగా ఉప్పొంగింది. మంచు చరియల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగిపోయింది. నదికి ఆకస్మికంగా వరద రావడంతో ఆ ధాటికి దిగువన ఉన్న డ్యామ్ ధ్వంసమైంది. నీటి ప్రవాహ ఉద్ధృతికి ఆనకట్ట కొట్టుకుపోయింది.
 
ఈ క్రమంలో వరద నీరు చమోలీ జిల్లా రైనీ తపోవన్ వద్ద ఉన్న రుషి గంగా విద్యుత్ కేంద్రాన్ని ముంచెత్తగా, ఆ విద్యుత్ కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. అందులోని 150 మంది కార్మికులు గల్లంతయ్యారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటీన రంగంలోకి దిగాయి. 
 
ఈ వరద కారణంగా ధౌలిగంగా నదీతీరంలో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. కాగా, సహాయక చర్యల కోసం ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ విభాగం సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఘటనాస్థలికి ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ చేరుకుని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments