Webdunia - Bharat's app for daily news and videos

Install App

దినకరన్‌కు కౌంట్ డౌన్ స్టార్టయ్యింది అంటున్న బిజెపి నేతలు.. ఎందుకు?

ఆర్కే నగర్ ఉప ఎన్నికల తరువాత దినకరన్ పేరు తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. దినకరన్ గెలవడమే కాదు... ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన భారతీయ జనతాపార్టీని తీవ్రస్థాయిలో విమర్శించాడు. కనీసం నోటాకు వచ్చిన ఓట్లు కూడా బిజెపి అభ్యర్థికి రా

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2017 (12:30 IST)
ఆర్కే నగర్ ఉప ఎన్నికల తరువాత దినకరన్ పేరు తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. దినకరన్ గెలవడమే కాదు... ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన భారతీయ జనతాపార్టీని తీవ్రస్థాయిలో విమర్శించాడు. కనీసం  నోటాకు వచ్చిన ఓట్లు కూడా బిజెపి అభ్యర్థికి రాకపోవడంతో హేళనగా వ్యాఖ్యలు చేశారు దినకరన్. ఆ వ్యాఖ్యలు కాస్త బిజెపి అధినాయకులు కోపాన్ని తెప్పించింది. అందుకే దినకరన్ పైన ఏకంగా తిరిగి ఐటీ దాడులు కొనసాగించేలా చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
దినకరన్ తీవ్ర వ్యాఖ్యల తరువాతే బిజెపి అధినాయకులకు కోపం వచ్చిందని, అందుకే దినకరన్ ఇళ్ళతో పాటు ఆయన ఆస్తులు, శశికళ ఆస్తులు, శశికళ బంధువుల ఇళ్ళపై దాడులు చేయించారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి కూడా ఐటీ దాడుల్లో భారీగా డబ్బు, నగలును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. దీంతో దినకరన్ పెదవి విరిచారు. 
 
నేను విమర్శలు చేయడం వల్లనే నాపై ఐటీ దాడులు చేయిస్తున్నారన్నారు. అయితే తమిళనాడు బిజెపి నాయకులు మాత్రం బహిరంగంగానే దినకరన్‌ను విమర్శిస్తున్నారు. బిజెపిని విమర్శించే నాయకుడికి దినకరన్‌కు పట్టిన గతే పడుతుందంటున్నారు. తమిళనాడు రాష్ట్రంలో బిజెపిని పటిష్టం చేయాలనుకున్న మోదీకి దినకరన్ రూపంలో అడ్డుతగిలిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments