Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువతి.. బలవంతంగా ఫస్ట్ నైట్

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (14:52 IST)
తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చికి చెందిన ఓ యువతి చేయకూడని పని చేసింది. తన కంటే వయసులో రెండేళ్లు చిన్నోడు అయిన మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతడిని బలవంతం చేసి శోభనం రాత్రిని ఎంజాయ్ చేసింది. అయితే, శారీరకంగా కలిసిన తర్వాత ఆ యువకుడు అనారోగ్యంపాలుకావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ యువతిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పొల్లాచ్చికి మాక్కిణం పట్టి నెహ్రూ నగర్‌కు చెందిన రాజశేఖరన్, గురునందని అనే దంపతులకు 17 యేళ్ల బాలుడు ఉన్నాడు. అదే ప్రాంతంలోని నేతాజీ నగర్‌కు చెందిన కృపాకరన్ అనే వ్యక్తికి 19 యేళ్ల యమున అనే కుమార్తె వుంది. ఈమె తన కంటే వయసులో చిన్నవాడైన మైనర్ బాలుడిని ప్రేమించింది. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 26వ తేదీన ఆ యువకుడిని కిడ్నాప్ చేసిన ఆ యువతి 27వ తేదీన పళని మురుగన్ ఆలయంలో వివాహం చేసుకుంది. అదే రోజు కోయంబత్తూరుకు చేరుకుంది. సాయంత్రం వరకు ఈషా ఫౌండేషన్‌లో ఉన్నారు. రాత్రికి ఇంటికి చేరుకునే క్రమంలో పెద్ద వర్షం వచ్చింది. దీంతో పొల్లాచ్చిలోని ఓ కిరాణా బంకు పక్కన తలదాచుకున్నారు. 
 
రాత్రంతా వర్షం కురుస్తూనే ఉండటంతో వీరిద్దరూ అక్కడే ఉన్నారు. అదేసమయంలో పెళ్లి చేసుకున్న యువకుడిని బలంవంతం చేసి అక్కడే శారీరకంగా కలుసుకున్నారు. ఆ తర్వాత యువకుడు అనారోగ్యానికి గురికావడంతో పొల్లాచ్చి ఆస్పత్రికి తరలించింది. ఇదిలావుంటే, తమ కుమారుడు కనిపించడం లేదంటూ యవకుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితురాలిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments