Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం నేరం కాదు.. వివాహితను ప్రియుడితో పంపిన ఎస్.ఐ

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (09:30 IST)
అక్రమ సంబంధం నేరం కాదంటూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. అనేక మంది భర్తలు తమ భార్యలకు అన్యాయం చేస్తూ ఇప్పటివరకు గుట్టుచప్పుడు కాకుండా పరాయి స్త్రీలతో సాగిస్తూ వచ్చిన అక్రమ సంబంధాన్ని ఇపుడు బహిర్గతం చేస్తున్నారు. అలాగే, కొంతమంది మహిళలు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత తాము ఇష్టపడిన ప్రియుడులతో ఉన్న వివాహేతర సంబంధాన్ని గుట్టురట్టు చేస్తున్నారు.
 
ఈ క్రమంలో తమిళనాడులో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకివచ్చింది. ఓ వివాహిత ప్రియుడితో వెళ్లిపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగ రీత్యా సౌదీలో ఉంటున్న ఆమె భర్త కూడా అక్కడి నుంచే ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుని తీసుకొచ్చారు. ఆమె కుటుంబ సభ్యులనూ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. 
 
ప్రియుడితోనే కలిసి ఉంటానని ఆమె పోలీసులకు తెలిపింది. దీనికి ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. వివాహేతర సంబంధం నేరం కాదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు గురించి పోలీసులు వారికి చెప్పారు. అయినా వారు అంగీకరించలేదు. చివరకు ఆమె ప్రియుడితో వెళ్లవచ్చని పోలీసులు పంపించేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌ ముందు నిరసన తెలిపారు. చివరకు వారికి పోలీసులు సర్దిచెప్పి ఇంటికి పంపించివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

కాలేజీ రోజుల్లో హిచ్ కాక్ సినిమాలు చూసేవాడిని : మెగాస్టార్ చిరంజీవి

త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా కామెడీ థ్రిల్లర్ జిగేల్ సిద్దమవుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments