తమిళనాడులో హిందీ భాషపై నిషేధమా? ఎవరు చెప్పారు? సీఎం స్టాలిన్ వివరణ

ఠాగూర్
గురువారం, 16 అక్టోబరు 2025 (10:37 IST)
తమిళనాడు రాష్ట్రంలో హిందీ భాషపై నిషేధం విధిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ఓ బిల్లు ప్రవేశపెట్టారంటూ జోరుగా ప్రచారం సాగింది. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వివరణ ఇచ్చారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది. హిందీని నిషేధించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని అధికారికంగా ప్రకటించి, ఈ వివాదానికి ముగింపు పలికింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడులో హిందీ హోర్డింగులు, బోర్డులు, సినిమాలు, పాటల్లో ఆ భాష వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు డీఎంకే ప్రభుత్వం సిద్ధమవుతోందంటూ బుధవారం జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో మరో ఏడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, నూతన విద్యా విధానంపై కేంద్రంతో ఇప్పటికే వివాదం నడుస్తుండటంతో ఈ వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాంతీయ భాషలపై హిందీని రుద్దుతున్నారనే దానికి ప్రతిస్పందనగానే ఈ చర్య అని డీఎంకే వర్గాలు చెప్పినట్లు వార్తలు రావడంతో చర్చ మరింత ఊపందుకుంది.
 
ఈ పరిణామం వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషణలు వెల్లువెత్తాయి. బీజేపీతో పొత్తులో ఉన్న అన్నాడీఎంకేను ఇరకాటంలో పెట్టేందుకే సీఎం స్టాలిన్ ఈ ఎత్తుగడ వేశారని ప్రచారం జరిగింది. ఒకవేళ బిల్లు అసెంబ్లీకి వస్తే, అన్నాడీఎంకే మద్దతిస్తే బీజేపీతో విభేదాలు వస్తాయి, వ్యతిరేకిస్తే సొంత రాష్ట్రంలో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది.
 
అయితే, ఈ వార్తలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బుధవారం రాత్రి ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. 'టీఎన్ ఫ్యాక్ట్ చెక్' అనే ప్రభుత్వ అధికారిక సామాజిక ఖాతా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. 
 
హిందీ భాష నిషేధానికి సంబంధించిన బిల్లు ప్రతిపాదన ఏదీ తమకు అందలేదని తమిళనాడు శాసనసభ కార్యదర్శి స్పష్టం చేశారని ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఒక్కరోజుగా సాగిన ఉత్కంఠకు తెరపడినట్లయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments