వయసు 73 - ఏక బిగువున 51 పుషప్స్... ఆశ్చర్యపరిచిన తమిళనాడు గవర్నర్ (Video)

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (13:57 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఏడు పదులు దాటిన వయసులో ఏకబిగువున 51 పుషప్స్ తీశారు. శనివారం మదురైలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పుషప్స్ తీయగా, దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
మదురైలోని వేలమ్మాళ్ విద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన యోగా వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక్కడ తన ఫిట్నెస్‌తో అక్కడున్న వారందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఏమాత్రం అలసట అనేది లేకుండా ఏక బిగువున 51 సార్లు పుషప్స్ పూర్తి చేశారు. ఆయన ఉత్సాహంగా పుషప్స్ చేస్తుండగా, అక్కడున్నవారంతా తమ కరేతాళ ధ్వనులతో అభినందించారు. 
 
ఐపీఎస్ మాజీ అధికారి అయిన రవి.. తన శిక్షణకాలం నాటి క్రమశిక్షణను ఇప్పటికీ పాటిస్తూ తన ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరుడుగా ఉండటమేకాకుండా ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ తాను ముందుంటానని ఆయన తన చర్యల ద్వారా నిరూపించారు. 
 
ఈ వీడియో చూసిన నెటిజన్లు గవర్నర్ ఫిట్నెస్‌కు ఫిదా అవుతున్నారు. వామ్మో... 73 యేళ్ళ వయసులో ఇంత ఫిట్‌గా ఎలా ఉంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మీది మామూలు బాడీ కాదు సార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని గవర్నర్ రవి నిరూపించారని కామెంట్స్ చేస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments