Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ దెబ్బకు విద్యార్థిని సూసైడ్.. రజనీకాంత్‌ విచారం..

దేశంలోని వైద్య కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసిన తమిళనాడుకు చెందిన విద్యార్థిని అనిత(17) సూసైడ్

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (09:37 IST)
దేశంలోని వైద్య కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసిన తమిళనాడుకు చెందిన విద్యార్థిని అనిత(17) సూసైడ్ చేసుకుంది. అరియలూర్‌ జిల్లాలోని తన ఇంట్లో విగత జీవిగా మారింది. తమిళనాడు బోర్డు నిర్వహించిన 12వ తరగతి తుది పరీక్షల్లో 1200 మార్కులకుగానూ అనిత 1176 మార్కులు సాధించింది. 
 
కానీ, నీట్‌ పరీక్షలో అర్హత సాధించలేకపోయింది. మెడిసిన్‌ చేయడానికి నీట్‌ను తప్పని సరిచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం వల్ల తనలాంటి విద్యార్థులు చాలా మంది నష్టపోతున్నారని, తమిళనాడు బోర్డు పరిధిలో విద్యనభ్యసించిన వారికి ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసింది. దీన్ని విచారించిన కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
కోర్టు తీర్పు అనేక మంది ఔత్సాహిక వైద్య విద్యార్థులకు శరాఘాతంగా మారింది. ఈ నేపథ్యంలో నీట్‌ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించలేదన్న బాధతో ఆత్మహత్మ హత్య చేసుకుంది. అనిత మృతి పట్ల సినీనటుడు రజనీకాంత్‌ విచారం వ్యక్తం చేశారు. ఇలా జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments