తమిళనాడులో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్.. కరోనా ఫ్రీ జిల్లాగా?

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (18:16 IST)
ఉత్తరప్రదేశ్ నుంచి తాజాగా చల్లటి కబురు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లా కరోనా నుంచి విముక్తి పొందిన తొలి జిల్లాగా నిలిచింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఫిలిబిత్ జిల్లాలో 2 కేసులు నమోదు కాగా, ఒకరిని ఇంతకుముందే డిశ్చార్చ్ చేశామని, రెండో వ్యక్తి కూడా సోమవారం డిశ్చార్చ్ అయ్యారని తెలిపారు. జిల్లాలో యాక్టివ్ కేసు ఒక్కటి కూడా లేదని తెలిపారు. ప్రస్తుతం కరోనా-ఫ్రీ జిల్లాగా ఫిలిబిత్ నిలిచినట్టు చెప్పారు.
 
రాష్ట్రంలో కరోనా కేసుల పరిస్థితిని వివరిస్తూ, రాష్ట్రంలో 550 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో 47 మంది ఆసుపత్రుల్లో పూర్తి స్వస్థత పొంది డిశ్చార్చ్ అయినట్టు అమిత్ మోహన్ ప్రసాద్ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా లాక్‌డౌన్‌ను పొడిగించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా తమిళనాడు కూడా చేరింది. ఏప్రిల్ 30వ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ముఖ్యమంత్రి ఎడపడ్డి కె పళనిస్వామి ప్రకటించారు.
 
తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు తెలిపారు. దీంతో దేశంలో ఇప్పటివరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన రాష్ట్రాల సంఖ్య ఏడుకు చేరింది.

ఇప్పటికే ఆరు రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా తమిళనాడు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

Rajinikanth : ఇద్దరు ఐకాన్లు కలవబోతున్నారు తలైవా173 కు సుందర్ సి.ఫిక్స్

Friday movies: సినిమా ప్రేమికులకు పదికిపైగా కనువిందు చేయనున్న ఈ వారం సినిమాలు

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

Sudheer Babu: ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ లేనివారికి కష్టం, అందుకే అలా మాట్లాడా : హీరో సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments