Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులు కేంద్రం మెడలు వంచి చరిత్ర సృష్టంచారు : సీఎం స్టాలిన్

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (14:53 IST)
రైతులకు హానిచేసేలా కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించారు. దీనిపై డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. రైతులు సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలను గుర్తించాలని ఆయన కోరారు. రైతులు ఏమాత్రం వెనకంజ వేయకుండా, పట్టువదలకుండా పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి ఒక చరిత్ర సృష్టించారని సీఎం స్టాలిన్ అన్నారు. 
 
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, సాగు చట్టాలను రద్దు చేయనున్నట్టు ప్రధాని మోడీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. రైతుల ఆందోళనను కేంద్రం అర్థం చేసుకుందని, ఇది శుభపరిణామని చెప్పారు. 
 
ఇదే అంశంపై కాంగ్రెస్ పూర్వాధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందిస్తూ, "అన్నదాతలు వారి సత్యాగ్రంతో అహంకారం తలదించేలా చేశారు. అన్యాయంపై విజయం సాధించి రైతులందరికీ శుభాకాంక్షలు. ఇది కేంద్ర ప్రభుత్వపు అహంకార ఓటమి, రైతుల విజయం" అంటూ ఆయన పేర్కొన్నారు. 
 
అలాగే, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్నవారి కంటే అధికారంలో కూర్చోబెట్టిన ప్రజల శక్తి మరింత శక్తిమంతమైనది అంటూ ట్వీట్ చేశారు. అలుపులేని పోరాటంతో తమకు కావాల్సిన దానిని సాధించుకుని, భారత రైతులంటే ఏంటో నిరూపించారని వ్యాఖ్యానించారు. జై కిసాన్ - జై జవాన్ అంటూ కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments