Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువణ్ణామలైలో ఒకే రోజు 54 కేసులు.. అంతా చెన్నై నుంచి వెళ్ళిన వారే...

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (11:47 IST)
తమిళనాడులో కరోనా వైరస్ పెరిగిపోతోంది. రోజుకు వెయ్యి కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఈ సంఖ్య చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోనే మరీ ఎక్కువగా ఉన్నాయి. అలాగే తిరువణ్ణామలైలో ఆదివారం ఒక్క రోజే 54 కేసులు నమోదయ్యాయి. ఇవి చెన్నై నుంచి అక్కడికి వెళ్లిన వారితోనే వ్యాప్తి చెందాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
 
ఇక, ఇప్పటి వరకు తమిళ రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలోని 43, ప్రైవేటుపరంగా ఉన్న 29 అంటూ, మొత్తంగా 72 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరిశోధనలు సాగుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో 1,149 కేసులు నమోదయ్యాయి. రెండో సారిగా 13 మరణాలు ఒకే రోజు సంభవించడం వైద్యుల్లో కలవరం రేపుతోంది.
 
లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన రంగాలను దశలవారీగా తిరిగి ప్రారంభించడానికి కేంద్రం ఇటీవల వివరణాత్మక మార్గదర్శకాలను వెల్లడించిన విషయం తెలిసిందే. నిర్దిష్ట కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో భారీ సడలింపులు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments