Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడు హత్య కేసులో తమిళ నటికి జీవితఖైదు!

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (14:43 IST)
వర్ధమాన దర్శకుడిని హత్య చేసిన కేసులో ఓ తమిళ నటికి యావజ్జీవ కారాగారశిక్షను విధిస్తూ చెన్నై అడిషనల్ కోర్టు తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... సరిత అలియాస్ సంగీత... తమిళ సినీ పరిశ్రమలో ఓ చిన్న నటి. 2007లో వర్ధమాన దర్శకుడు సెల్వా ఓ చిత్రంలో నటించేందుకు సంగీతను ఎంపిక చేసుకున్నాడు. 
 
తన పారితోషికం చెల్లించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, సెల్వా వడపళనిలోని ఓ లాడ్జిలో రెండు గదులు అద్దెకు తీసుకుని, సినిమా గురించి చర్చించాలంటూ నటీనటులను పిలిచాడు. అందులో సంగీత కూడా ఉంది. అప్పటికే అతడిపై ఆగ్రహంతో ఉన్న ఆమె ఇదే అదనుగా గొంతు నులిమి చంపేసింది. అనంతరం, గదికి తాళం వేసి పరారైంది. 
 
అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేయగా, బెయిల్ పై బయటికొచ్చి ఏడేళ్లు అజ్ఞాతంలోకి వెళ్లింది. గతేడాది డిసెంబర్ లో పోలీసులకు పట్టుబడింది. తాజాగా, విచారణ జరిపిన అడిషనల్ సెషన్స్ కోర్టు ఆమెకు జీవిత ఖైదుతో పాటు రూ.5000 జరిమానా విధించింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments