Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంచి శంకర స్వామి సూచన మేరకే సీఈసీ పదవి చేపట్టా : ఆత్మకథలో టీఎన్ సేషన్

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (10:17 IST)
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (కంచి శంకరాచార్య) సూచన మేరకు భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించినట్టు తన ఆత్మకథలో మాజీ సీఈసీ టీఎన్. శేషన్ పేర్కొన్నారు. త్రూ ది బ్రోకెన్ గ్లాస్ అనే పేరుతో టీఎన్ శేషన్ తన ఆత్మకథను రాశారు. దీన్ని ఆయన మరణాంతరం రూప పబ్లికేషన్ ప్రచురించింది. ఇందులో... తాను సీఈసీ పదవిని ఎలా చేపట్టాల్సి వచ్చిందనేది శేషన్ ఇలా వివరించారు. 
 
1990లో అనారోగ్యంతో నాటి సీఈసీ పేరిశాస్త్రి మరణించారు. అప్పుడు కేంద్రం న్యాయ శాఖ కార్యదర్శి రమాదేవిని యాక్టింగ్ సీఈసీగా నియమించింది. ఆమె బాధ్యతలు చేపట్టిన నాలుగో రోజు కేబినెట్ కార్యదర్శి వినోద్ పాండే. నుంచి నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు ప్రణాళికా సంఘం సభ్యుడిగా ఉన్నాను. తనకు సీఈసీ పదవి ఇవ్వాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిపారు. 
 
వేకువజామున 2 గంటలకు రాజీవ్ గాంధీకి ఫోన్ చేశాను. 2.30 కల్లా ఆయన దగ్గరకు వెళ్లాను. సీఈసీ పోస్టు నీకు మంచిది కాదు. ప్రత్యామ్నాయంగా ఏ పోస్టూ లేకపోతేనే సీఈసీ పదవి తీసుకో అని ఆయన సలహా ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి వెంకట్రామన్‌కు విషయం చెప్పాను. సీఈసీ పదవి నీకు కరెక్టు కాదు అన్నారు. దీంతో, అయోమయంలో పడ్డాను. 
 
చివరకు కంచి శంకరాచార్య (జయేంద్ర సరస్వతి) సలహా కోరాను. సీఈసీ చాలా బాధ్యతాయుతమైన పదవి చేపట్టాలని ఆయన సూచించారు. వెంటనే మంత్రికి ఫోన్ చేసి పదవి చేపట్టేందుకు సంసిద్ధత తెలిపాను' అని శేషన్ వివరించారు. 1990 డిసెంబరు 12న ఎన్నికల కమిషనర్‌గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. సీఈసీ పదవి తనకు సంతృప్తినిచ్చిందని శేషన్ రాసుకొచ్చారు. 
 
నిజంగానే శేషన్ సీఈసీగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అసలు ఎన్నికల సంఘం అంటే ఇలా ఉంటుందా, దానికున్న అధికారాలు, స్వతంత్రత ఏంటి అని దేశ ప్రజల్లో అవగాహన కల్పించిన ఘనత ఆయనకే దక్కింది. అనేక మంది రాజకీయ నేతలకు శేషన్ టెర్రర్‌గా నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments