Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతి హత్య కేసును సీబీఐ విచారణకు బదిలీ చేయాల్సిన అవసరం లేదు: హైకోర్టు

చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో దారుణంగా హత్యకు గురైన టెక్కీ స్వాతి హత్య కేసులో సీబీఐ విచారణ లేదని తేలిపోయింది. స్వాతి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (08:40 IST)
చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో దారుణంగా హత్యకు గురైన టెక్కీ స్వాతి హత్య కేసులో సీబీఐ విచారణ లేదని తేలిపోయింది. స్వాతి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం కొట్టిపారేసింది. గత జూన్ 24వ తేదీ ఉదయం నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో స్వాతి హత్యకు సంబంధించి సెంగోటకు చెందిన రాంకుమార్‌ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ నేపథ్యంలో  స్వాతి కేసులో నిందితులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని, అమాయకుడైన తన కొడుకును అరెస్టు చేసారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ రాంకుమార్‌ తల్లి పుష్పం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. స్వాతి హత్య కేసును సీబీఐ విచారణకు బదిలీ చేయాల్సిన అవసరం లేదని పుష్పం పిటిషన్‌ను తోసిపుచ్చారు. 
 
ప్రస్తుతం పుళల్‌ సెంట్రల్‌ జైలులో ఉంటున్న రామ్‌కుమార్‌కు బెయిలు కోసం ఆయన తరఫు న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాతి హత్య కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ రామ్‌కుమార్‌ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments