Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ కుమార్ కరెంట్ తీగ పట్టుకునేదాక పోలీసులు ఏం చేశారు.. షాక్ కొడుతుందని చూస్తుండిపోయారా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై నుగంబాక్కం టెక్కీ హత్య కేసులో నిందితుడైన రామ్ కుమార్ ఆదివారం విద్యుత్ తీగ నోట కొరికి షాక్‌కు గురైయ్యాడు. చెన్నై శివారులో వున్న పుళల్‌ సెంట్రల్‌ జైలు వంటగది వద్ద

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (16:05 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై నుగంబాక్కం టెక్కీ హత్య కేసులో నిందితుడైన రామ్ కుమార్ ఆదివారం విద్యుత్ తీగ నోట కొరికి షాక్‌కు గురైయ్యాడు. చెన్నై శివారులో వున్న పుళల్‌ సెంట్రల్‌ జైలు వంటగది వద్ద వున్న కరెంటు బాక్స్‌లో వున్న విద్యుత్ తీగను నోటితో కొరికి, విద్యుదాఘాతంతో మరణించాడు. ఈ నేపథ్యంలో రామ్ కుమార్ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం రాయపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 
 
కానీ రామ్ కుమార్‌కు కరెంట్ తీగ ఎలా దొరుకుతుందనే దానిపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అంతమంది పోలీసులున్నప్పటికీ.. అతనికి విద్యుత్ తీగ ఎలా లభించింది. దానిని రామ్ కుమార్ పట్టుకునేంతవరకు పోలీసులు ఏం చేశారనే దానిపై చర్చ సాగుతోంది. 
 
కాగా మేజిస్ట్రేట్ సమక్షంలో రామ్‌కుమార్‌ భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఆసుపత్రివర్గాలు పేర్కొన్నాయి. కాగా రామ్‌కుమార్‌ మృతదేహం చూసేందుకు కూడా తనను అనుమతించలేదంటూ అతని తరఫున వాదిస్తున్న న్యాయవాది రామ్‌రాజ్‌ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. రామ్ కుమార్‌ది ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కాదని ఆ కేసును వాదిస్తున్న రామ్ కుమార్ న్యాయవాది రామ్ రాజ్ తెలిపారు. ఇంకా మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. 
 
గత జూన్ 24వ తేది ఉదయం 6.30 గంటలకు స్థానిక నుంగంబాక్కం రైల్వేస్టేషనలో రైలుకోసం వేచివున్న ఐటీ ఉద్యోగిని స్వాతి వద్దకు వచ్చిన ఓ యువకుడు కత్తితో దారుణంగా పొడిచి పారిపోయాడు. అనంతరం రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన స్వాతి అక్కడే కన్నుమూసింది. 
 
హంతకుడి కోసం వారం రోజుల పాటు హంతకుడిని గుర్తించేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. సీసీ కెమెరాల సాయంతో అతను తిరునల్వేలి జిల్లా మీనాక్షిపురానికి చెందిన రామ్‌కుమార్‌ తెలియవచ్చింది. జూలై 1వ తేదీన అక్కడ రామ్‌కుమార్‌ను పట్టుకుంటుండగా అతను బ్లేడుతో గొంతుకోసుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు ప్రకటించారు. అలా అరెస్టయిన రామ్ కుమార్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశమైంది. 
 
విద్యుత్ తీగను రామ్ కుమార్ పట్టుకునేంత వరకు పోలీసులు ఏం చేస్తున్నారని.. కరెంట్ తీగ పట్టుకున్నాడు.. అతడిని పట్టుకుంటే షాక్ కొడుతుందని పోలీసులు దూరంగా ఉండిపోయారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు. రామ్ కుమారే కదా.. షాక్ కొట్టి పోతే పోనీ అని వదిలేశారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇకపోతే.. రామ్ కుమార్ భౌతిక కాయానికి పోస్ట్ మార్టమ్‌ నిర్వహించడంపై హైకోర్టులు ఉత్తర్వులు వచ్చేదాక ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రామ్ కుమార్ ఆత్మహత్యపై అనుమానాలున్నాయని ఆయన తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ఇచ్చే ఉత్తర్వులకు అనంతరమే పోస్ట్ మార్టమ్ చేయాల్సి వుంటుంది.  

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments