Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్‌కు సుష్మా స్వరాజ్ వార్నింగ్.. సారీ చెప్తారా? వీసా రద్దు చేయమంటారా?

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రజలకు క్షమాపణ చెప్తారా? లేక వీసా రద్దు చేయమంటారా? అంటూ ఆమె హెచ్చరిక చేశారు.

Webdunia
గురువారం, 12 జనవరి 2017 (06:38 IST)
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. భారత ప్రజలకు క్షమాపణ చెప్తారా? లేక వీసా రద్దు చేయమంటారా? అంటూ ఆమె హెచ్చరిక చేశారు. 
 
భారత జాతీయ పతాకాన్ని ముద్రించిన డోర్ మ్యాట్‌లను ఈ సంస్థ విక్రయిస్తోంది. వీటిని తక్షణం వాటిని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకోవాలని, లేకుంటే ఇక్కడ ఆ సంస్థ ప్రతినిధులందరి వీసాలనూ రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 
 
ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెడుతూ, "అమెజాన్ సంస్థ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. మా దేశ పతాకం ఉన్న అన్ని రకాల ప్రొడక్టుల విక్రయాలను నిలిపివేయాలి. ఈ పని చేయకుంటే, అమెజాన్ అధికారులెవ్వరికీ వీసాలు జారీ చేయం. గతంలో ఇచ్చిన వీసాలనూ రద్దు చేస్తాం" అన్నారు. 
 
కాగా, సుష్మా స్వరాజ్ ట్వీట్ చేసిన నాలుగు గంటల్లోనే అమెజాన్ కేటలాగ్ నుంచి అభ్యంతరకర ప్రొడక్టులను ఆ సంస్థ తొలగించింది. సెర్చ్ రిజల్ట్స్ నుంచి కూడా వాటిని తొలగించింది. ఈ ప్రొడక్టులను తాము డైరెక్టుగా విక్రయించడం లేదని, వాటిని థర్డ్ పార్టీ సెల్లర్స్ తమ వెబ్‌సైట్ మాధ్యమంగా విక్రయిస్తున్నారని వివరణ ఇచ్చింది. 

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments