సుశాంత్ మృతి కేసుతో దుబాయ్‌కి లింకుంది : బీజేపీ ఎంపీ స్వామి

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (17:20 IST)
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ కేసుకు, దుబాయ్‌కు లింకుందని పేర్కొన్నారు. అందువల్ల దివంగత నటి శ్రీదేవి మృతితోపాటు హైప్రొఫైల్ మృతి కేసుల్లో సీబీఐ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
నిజానికి సుశాంత్ ఆత్మహత్య కేసులో డాక్టర్ స్వామి అపుడపుడూ బాంబు పేల్చుతూనే వున్నాడు. తాజాగా మరోమారు సంచలన ట్వీట్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య జదరిగిన రోజు దుబాయ్ డ్రగ్ డీలర్ అయష్ ఖాన్ అతడిని కలిసినట్టు స్వామి ఆరోపించారు. 
 
'సునంద పుష్కర్ మృతి కేసులో, పోస్టుమార్టం సందర్భంగా ఎయిమ్స్ వైద్యులు ఆమె కడుపులో ఏమి గుర్తించారో అదే అసలైన ఆధారంగా నిలిచింది. కానీ శ్రీదేవి, సుశాంత్ విషయంలో ఇది జరగలేదు. సుశాంత్ విషయానికొస్తే సుశాంత్ హత్యకుగురైన రోజు దుబాయ్‌ డ్రగ్ డీలర్ అయష్ ఖాన్ అతడిని కలిశాడు. ఎందుకు?' అని ప్రశ్నించారు. 
 
కాగా గత వారంలో కూడా సుశాంత్ మృతి కేసుతో దుబాయ్‌కి లింకు ఉందంటూ స్వామి ఆరోపించిన విషయం తెలిసిందే. శ్రీదేవి సహా గతంలో నమోదైన హైప్రొఫైల్ మృతి కేసుల్లోనూ సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments