Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్జికల్ స్ట్రైక్స్‌ చేపట్టడానికి ముందు.. దర్గా వద్ద ప్రార్థనలు చేసిన భారత జవాన్లు...

యురీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి అడుగుపెట్టి.. సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. ఈ మెరుపు దాడులతో పాకిస్థాన్ నివ్వెర పోయింది. అలాగే, భారత్ జరిపిన దాడులకు ప్రపంచ వ్యాప్తంగా

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (13:21 IST)
యురీ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి అడుగుపెట్టి.. సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. ఈ మెరుపు దాడులతో పాకిస్థాన్ నివ్వెర పోయింది. అలాగే, భారత్ జరిపిన దాడులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి మద్దతు కూడా లభించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ... ఈ దాడులకు వెళ్లే ముందు భారత ఆర్మీ ఏం పని చేసిందో ఓ సారి తెలుసుకుంటే పతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. 
 
ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు దేవుడికి మొక్కుకోవడం సహజం. ఆపరేషన్లు చేపట్టేటప్పుడు మన జవాన్లు కూడా ప్రార్థనలు చేయడం సాధారణమే. పీవోకేలో సర్జికల్‌ దాడులు చేయడానికి ముందు కూడా అక్కడి దర్గాలో 6 బీహార్‌, 10 డోగ్రా యూనిట్ల జవాన్లు ప్రార్థనలు జరిపారు. 
 
ఈ దర్గా భారత సరిహద్దుల్లోనే నవ్‌కోట్‌, చని గ్రామాల్లో ఉంటుంది. 1971 యుద్ధంలో ఇక్కడి ప్రజలంతా వలస పోయారు. దాంతో ఈ దర్గాను పట్టించుకునేవారు కరువయ్యారు. మన సైనికులు కూడా ఇది పాకిస్థాన్‌ దర్గా అని కొన్ని దశాబ్దాలపాటు అనుకున్నారు. కానీ, ఓ పశువుల కాపరి అందులో చిక్కుకుని ఆర్తనాదాలు చేయడంతో మనవాళ్లు రక్షించారు. అతడికే దర్గా సంరక్షణ బాధ్యతలు కూడా అప్పగించారు. ఆ దర్గా వద్ద సైనికులు ప్రార్థనలు చేసి సర్జికల్ స్ట్రైక్స్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments