Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశికళపై కేసులో తీర్పు వచ్చేవారమే.. నిరీక్షణ తప్పనట్లే

ముఖ్యమంత్రి పదవి చిక్కుతుందా లేక చిక్కదా అంటూ మల్లగుల్లాలు పడుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి ఇది చేదువార్తే. అక్రమాస్తుల కేసులో తీర్పు నేడు వెలువరిస్తుందనుకున్న సుప్రీంకోర్టులో ఆ కేసు లస్టింగులోనే నమోదు కాకపోవడంతో వచ్చే

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (03:41 IST)
ముఖ్యమంత్రి పదవి చిక్కుతుందా లేక చిక్కదా అంటూ మల్లగుల్లాలు పడుతున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వర్గానికి ఇది చేదువార్తే. అక్రమాస్తుల కేసులో తీర్పు నేడు వెలువరిస్తుందనుకున్న సుప్రీంకోర్టులో ఆ కేసు లస్టింగులోనే నమోదు కాకపోవడంతో వచ్చేవారం వరకు వేచి చూడాల్సి ఉంటుందని సమాచారం. 
 
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు పావులు కదుపుతున్న వీకే శశికళను అక్రమాస్తుల కేసు వెంటాడుతున్నది. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ కూడా నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరిస్తుందని అందరూ భావించారు. ఈ తీర్పు ప్రతికూలంగా వస్తే.. శశికళకు సీఎం పదవి చేపట్టే చాన్స్‌ ఉండదని అనుకున్నారు. అయితే, సుప్రీంకోర్టు శుక్రవారం లిస్టింగ్‌లో ఈ కేసు నమోదుకాలేదు. దీంతో ఈ కేసులో వచ్చేవారం తీర్పు వెలువడే అవకాశముందని భావిస్తున్నారు.
 
అక్రమాస్తుల కేసులో దివంగత సీఎం జయలలితతోపాటు శశికళను, ఆమె కుటుంబసభ్యులను కర్ణాటకలోని దిగువ కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును జయలలిత సవాల్‌ చేయడంతో కర్ణాటక హైకోర్టు దీనిని కొట్టేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ క్రమంలో జయలలిత మరణించడం, ఆమె నెచ్చెలి అయిన శశికళ అన్నాడీఎంకే అధినేత్రిగా ఎన్నికకావడమే కాకుండా.. సీఎం పదవి కోసం సిద్ధమవుతుండటంతో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
ఈ వారంలోనే ఈ కేసులో తీర్పు వెలువరిస్తామని గతంలో సుప్రీంకోర్టు సంకేతాలు ఇచ్చింది. అయితే, శుక్రవారం ఈ కేసు లిస్టింగ్‌ కాకపోవడంతో వచ్చేవారం తీర్పు రావొచ్చునని భావిస్తున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

కె.సీఆర్ స్పూర్తితో కేశవ చంద్ర రమావత్ సినిమా : హరీష్ రావు

మంచి క్వశ్చన్ కొట్టు.. గోల్డ్ కాయిన్‌ పట్టు ఐడియా నాదే: విశ్వక్ సేన్

రెహమాన్ కు మాట ఇచ్చా అందుకే మాలలో వున్నా వచ్చా : రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments