Webdunia - Bharat's app for daily news and videos

Install App

షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలు.. తేల్చేసిన సుప్రీం కోర్టు

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (20:38 IST)
జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ పరీక్షల వాయిదా కోసం ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ఆరు రాష్ట్రాల మంత్రులు దాఖలు చేసిన సంయుక్త రివ్యూ పిటిషన్‌ను ధర్మాసనం శుక్రవారం తిరస్కరించింది. జేఈఈ, నీట్ వాయిదాకు దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. 
 
కాగా, ఈ తీర్పుపై సమీక్ష కోరుతూ పశ్చిమబెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు సంయుక్తంగా ఆగస్టు 28న సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఒకవైపు కరోనా, మరోవైపు వర్షాలు, వరదల పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరాయి. 
 
ఆగస్టు 17న కోర్టు ఇచ్చిన తీర్పులో సమగ్ర న్యాయ పరిశీలన జరగలేదని చెప్పాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తిరస్కరించింది. జేఈఈ, నీట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగాలని చెప్పింది. ఈ నెల 1 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతుండగా, 13న నీట్ పరీక్ష జరుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments