కరెన్సీ కష్టాలు : మీరు కోరినట్టుగా ఒకే చోట విచారించలేం... కేంద్రానికి సుప్రీంకోర్టు
కరెన్సీ కష్టాలపై ఆయా కోర్టుల్లో దాఖలైన పిటీషన్లన్నింటిపైనా ఒకేచోట విచారించడం వీలుపడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఠాకూర్‌తో పాటు జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎల
కరెన్సీ కష్టాలపై ఆయా కోర్టుల్లో దాఖలైన పిటీషన్లన్నింటిపైనా ఒకేచోట విచారించడం వీలుపడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఠాకూర్‌తో పాటు జస్టిస్ డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావ్ కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.
నోట్ల రద్దుపై వెంటనే ఉపశమన చర్యలు చేపట్టాలని పలు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణపై స్టే విధించి, అన్నింటినీ ఒకేచోట విచారించాలని, ఇందులో వివిధ అంశాలు ఉన్నాయని, ప్రజలు ఉపశమనం కోసం హైకోర్టులను ఆశ్రయించారని, హైకోర్టుల ద్వారా వారికి తక్షణ ఉపశమనం దొరకవచ్చని ధర్మాసనం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గితో పేర్కొంది.
'మీరు తగిన చర్యలు తీసుకుంటున్నారని భావిస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎంత మొత్తాన్ని సేకరించారు' అని న్యాయస్థానం అటార్నీ జనరల్(ఏజీ)ను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయని, నోట్ల రద్దు కారణంగా వివిధ బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.6 లక్షల కోట్ల పైన నగదు డిపాజిట్ అయ్యిందని చెప్పారు.
డిజిటల్ నగదు లావాదేవీల్లో ఇదో పెద్ద ఉప్పెన లాంటిదని ఏజీ అన్నారు. 70 సంవత్సరాలుగా దేశంలో పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఏరోజుకారోజే కాదు, గంట గంటకీ ప్రభుత్వం పరిస్థితిని అంచనా వేస్తోందని పేర్కొన్నారు.