Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి లడ్డూల్లో జంతు కొవ్వు.. సీబీఐ విచారణ.. పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం

సెల్వి
శుక్రవారం, 8 నవంబరు 2024 (13:09 IST)
వైఎస్ జగన్ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతు కొవ్వును ఉపయోగించారనే ఆరోపణలపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 
 
సామాజిక కార్యకర్త, 'గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్' సంస్థ అధ్యక్షుడు అయిన పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందించింది. పాల్ విజ్ఞప్తి మేరకు అన్ని దేవాలయాలయాల ప్రసాదాలను పరిశీలించే అంశం అనేది అంత సులువు కాదని సుప్రీం పేర్కొంది.
 
లడ్డూ ప్రసాదం కొనుగోలు, తయారీలో అవినీతి, నిర్వహణలో లోపాలున్నాయని వచ్చిన ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సమగ్ర దర్యాప్తు జరిపించాలని పాల్ తన పిటిషన్‌లో కోరారు. కాగా ఇప్పటికే తిరుపతి లడ్డూల తయారీలో జంతు కొవ్వును వినియోగించారనే ఆరోపణలపై విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్‌ను అక్టోబర్ 4న సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.
 
కల్తీ నెయ్యితో సహా 'లడ్డూ ప్రసాదం' తయారీలో నాసిరకం పదార్థాలను ఉపయోగించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయని, ఈ పవిత్ర ప్రసాదం పవిత్రతను దెబ్బతీస్తున్నాయని పాల్ తన పిల్‌లో పేర్కొన్నారు.
 
మతాన్ని ఆచరించడానికి, ప్రచారం చేయడానికి స్వేచ్ఛకు హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను ఉటంకిస్తూ, పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలు, ప్రాథమిక మత హక్కుల ఉల్లంఘనను పిటిషన్ నొక్కి చెప్పింది.
 
రాజకీయ అవకతవకలు, అవినీతి మన పవిత్ర సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా చూడాలని భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ పిటిషన్‌ దాఖలు చేశానని పాల్‌ తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని తిరుపతి లడ్డూల తయారీలో జంతు కొవ్వును వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"గేమ్ ఛేంజర్" టీజర్‌ను ఏయే థియేటర్లలో రిలీజ్ చేస్తారు?

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments