Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో సూపర్ బైక్ రేస్‌లు నిషేధించాలి.. ఓ తండ్రి ఆవేదన.. ఎందుకు?

దేశవ్యాప్తంగా సూపర్ బైక్‌ రేస్‌లను నిషేధించాలని ఓ తండ్రి ప్రాధేయపడుతున్నాడు. పైగా, మరెవరూ నాలా చేయవద్దంటూ బిడ్డలు కలిగిన తల్లిదండ్రులకు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విజ్ఞప్తి వెనుక ఉన్న కన్నీటి

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (10:15 IST)
దేశవ్యాప్తంగా సూపర్ బైక్‌ రేస్‌లను నిషేధించాలని ఓ తండ్రి ప్రాధేయపడుతున్నాడు. పైగా, మరెవరూ నాలా చేయవద్దంటూ బిడ్డలు కలిగిన తల్లిదండ్రులకు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విజ్ఞప్తి వెనుక ఉన్న కన్నీటి గాథను పరిశీలిస్తే... 
 
ఢిల్లీలో ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరు సురేష్ బన్సాల్. ఇప్పుడు ఈయన కొడుకు పోయిన బాధలో మునిగిపోయివున్నారు. 24 సంవత్సరాలు కంటికి రెప్పలా పెంచుకున్న కొడుకు హిమాన్షు బన్సాల్ దూరమయ్యాడు. కొడుకు అడిగాడు కదా అని ఎనిమిది నెలల క్రితం బినెల్లీ టీఎన్టీ 600ఐ సూపర్ బైక్‌ను ప్రేమగా కొనిస్తే, అదే ఇప్పుడు ఆయన కుమారుడిని దూరం చేసింది.
 
దీనిపై ఆయన స్పందిస్తూ... "నేను ఆ బైక్‌ను కొనిచ్చి ఎనిమిది నెలలే అయింది. నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు నాకు తెలుస్తోంది. మరే తల్లిదండ్రులూ ఈ తప్పు చేయవద్దు. దేశంలో అసలు సూపర్ బైక్‌లన్నింటినీ నిషేధించాలి" అని ఆయన అన్నారు. కాగా, ఢిల్లీ వీధుల్లో తన బైక్‌పై 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ, ఓ పాదచారిని తప్పించే క్రమంలో అదుపుతప్పిన హిమాన్షు బన్సాల్ బైక్, డివైడర్‌ను ఢీకొనగా, తీవ్ర గాయాలతో అతను మృతి చెందిన సంగతి తెలిసిందే. 
 
దేశంలోని రహదారులు సూపర్ బైక్‌లను నడిపేందుకు అనువుగా లేవన్న సంగతి తనకు తెలిసొచ్చిందని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోయారు. కన్నాట్ ప్లేస్ నుంచి సెంట్రల్ ఢిల్లీకి తన ఇద్దరు స్నేహితులతో కలసి బైక్ రేస్ పెట్టుకున్న హిమాన్షు వేగంగా వెళుతూ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఈ ముగ్గురి రేస్ అక్కడి ఎన్నో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంకిత్ కోయ్య నటించిన 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా రివ్యూ

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments